తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ ఆఖరుగా వారిసు అనే మూవీ లో హీరో గా నటించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ లో శ్రీకాంత్ ... విజయ్ కి సోదరుడి పాత్రలో నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తెలుగు లో వారసుడు పేరుతో విడుదల అయింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ "లియో" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా కనిపించబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ మార్చి 29 వ తేదీ నుండి చెన్నై లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ లో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: