తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ ఈ మధ్య వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే విశ్వక్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ యువ హీరో ఆశ్విత్ మరిమత్తు దర్శకత్వంలో రూపొందినటువంటి ఓరి దేవుడా అనే సినిమాలో హీరో గా నటించాడు.

మిథిలా పాల్కర్ , ఆశా భట్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టు కోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకొని డీసెంట్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

 ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని  ఏప్రిల్ 30 వ తేదీన సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమిని టీవీ లో ప్రసారం చేయనున్నారు. మరి థియేటర్ లలో మంచి విజయం సాధించిన ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. లియోన్ జేమ్స్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: