ఒకప్పుడు రిలీజ్ అయిన సమయంలో వచ్చిన వసూళ్ల కంటే ఇక ఇప్పుడు రీ రిలీజ్ అయిన సమయంలో వచ్చిన వసూళ్ళే ఎక్కువ అని చెప్పడంలోను అతిశయోక్తి లేదు. అయితే ఇక ఇప్పుడు ఆరెంజ్ సినిమా మరోసారి రిలీజ్ కు సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే టాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక ఇప్పుడు జపాన్ లో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతుంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక వైవిద్యమైన దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజెర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిన నేపథ్యంలో ఇక ఆయన నటించిన అరేంజ్ సినిమాను జపాన్ లో రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ గానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలోని కాన్సెప్ట్ ప్రతి ఒక్క యువకుడి హార్ట్ కి కనెక్ట్ అయ్యింది అని చెప్పాలి. కాగా మే ఆరవ తేదీన జపాన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవలే ఆరెంజ్ సినిమా మేకర్స్ ప్రకటించారు. మరి జపాన్ లో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.