సూపర్ స్టార్ మహేష్ బాబు ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్.లో ప్రస్తుతం ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్య దేవర రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఈ మూవీ లో జయరామ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... జగపతి బాబు ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించననున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతి బాబు ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో తన పాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా జగపతి బాబు మాట్లాడుతూ ... గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో గా రూపొందిన అరవింద సమేత మూవీ లో తాను పోషించిన బసిరెడ్డి పాత్రకి అందరి నుండి మంచి పేరు వచ్చిందని జగపతి బాబు అన్నారు. అయితే ఆ పాత్రకు మించి మరింత క్రూరంగా పవర్ఫుల్ గా మహేష్ 28 మూవీ లో తన పాత్రని త్రివిక్రమ్ డిజైన్ చేసారని తాజా ఇంటర్వ్యూలో జగపతి బాబు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: