ప్రభాస్ రాముని పాత్రలో ఓం రౌత్  డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై భారీగా అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఆదిపురుష్ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఒకటి రెండు షాట్స్ పై పెదవి విరిచినా మిగతా ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉందని కామెంట్లు కూడా చేస్తున్నారు

మరోవైపు ట్రైలర్ లో ప్రభాస్ వాయిస్ పై భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ వాయిస్ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ మాటలు గత సినిమాలలా లేవని బరువుగా డైలాగ్స్ చెబుతున్నట్టు అనిపించిందని కొంతమంది అయితే చెబుతున్నారు. ఆదిపురుష్ రిలీజ్ సమయానికి ఈ తప్పులను సరిదిద్దుకుంటే సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉంటుందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ ట్రైలర్ కు 10 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. హనుమంతుని వాయిస్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచిందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

గ్రాఫిక్స్ విషయంలో మెరుగులు దిద్దడం ట్రైలర్ కు ప్లస్ అయింది. ఆదిపురుష్ మూవీ జూన్ నెల 16వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా అదే రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ చేయడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించాల్సి అయితే ఉంది. ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు అదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఆదిపురుష్ సక్సెస్ సాధిస్తే మరిన్ని భారీ మైథలాజికల్ సినిమాల దిశగా అడుగులు పడతాయని అయితే చెప్పవచ్చు. ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కలలను నిజం చేస్తుందో లేదో చూడాలి మరి.. కృతిసనన్ సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణుని పాత్రలో ఓం రౌత్ డైరెక్షన్ లో టీ సిరీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో అయితే ఈ సినిమా రూపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: