ఈ క్రమంలోనే బంగార్రాజు సినిమాతో హిట్టు కొట్టి మంచి జోష్ లొ ఉన్న నాగచైతన్య ఇక ఇటీవలే కస్టడీ అనే ఒక వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా నాగచైతన్య కెరియర్ కు ఎక్కడ యూస్ అవ్వలేదు కదా.. మైనస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పటివరకు చైతన్య కెరియర్లో చూసుకుంటే చాలా సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ సాధించినవి మాత్రం కొన్ని చిత్రాలే ఉన్నాయి.
ఇక సమంతతో విడాకుల తర్వాత ఒకవైపు వ్యక్తిగతంగా మరోవైపు కెరియర్ పరంగా కూడా నాగచైతన్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవడే కష్టడి ప్లాప్ తర్వాత మూడ్ ఆఫ్ లో ఉన్న నాగచైతన్య షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. ఏకంగా మరో మూడు సినిమాలు మాత్రమే చేసి పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నాడట నాగ చైతన్య. ఇక చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకొని బిజినెస్ వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకుంటున్నాడట నాగచైతన్య. మంచి నిర్ణయం తీసుకున్నాడు. మీ బ్రదర్స్ ఇద్దరికీ సినిమాల్లో కలిసి రావట్లేదు.. ఎంచక్కా బిజినెస్ చూసుకోండి అంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక అక్కినేని అభిమానులు ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు.