ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రెండు బడా సినిమాలు చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు రాబోయే సంక్రాంతి పై ఫోకస్ పెట్టారు హీరోలు. వచ్చే సంక్రాంతికి ఈ సారి గట్టిపోటీనే ఉండనుందని తెలుస్తోంది. నెక్స్ట్ సంక్రాంతికి ఇప్పటి నుంచే కర్చీఫ్ లు వేస్తున్నారు దర్శక నిర్మాతలు.

సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్. పెద్ద చిన్న అని తేడా లేకుండా సంక్రాంతిని టార్గెట్ చేసుకొని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రెండు బడా సినిమాలు చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు రాబోయే సంక్రాంతి పై ఫోకస్ పెట్టారు హీరోలు. వచ్చే సంక్రాంతికి ఈ సారి గట్టిపోటీనే ఉండనుందని తెలుస్తోంది. నెక్స్ట్ సంక్రాంతికి ఇప్పటి నుంచే కర్చీఫ్ లు వేస్తున్నారు దర్శక నిర్మాతలు. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది.. సూపర్ స్టార్ మహేష్  బాబు త్రివిక్రమ్ సినిమా గురించే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ బాబు లుక్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది.ఈ మూవీ రిలీజ్ డేట్ జనవరి 12గా ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా..

ఆతర్వాత కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారతీయుడు 2 సినిమాకూడా సంక్రాంతిని టార్గెట్ చేసింది. ఇండియన్ 2 చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకూడా సంక్రాంతే టార్గెట్ చేసింది.

పవర్ స్టార్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన వీడియో సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీ సినిమాలతో పటు మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి కి రిలీజ్ కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: