గత కొంత కాలం నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి పలు చిత్రాలు. కాంతార, బలగం వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సెషన్ అంతా ఇంత కాదు.వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ఆ సినిమాల్లో ఎలాంటి పెద్ద పెద్ద స్టార్స్ లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చి భారీగా వసూళ్లని రాబట్టాయి. ఇంకా అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ కూడా అందుకున్నాయి. ఇక ఇటీవల మలయాళంలో ప్రభంజనం సృష్టించిన మూవీ 2018. ఈ సినిమా విడుదలైన మొదటిరోజునే  బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహకందని రీతిలో కలెక్షన్స్ వసూలు చేస్తోంది. డైరెక్టర్ ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కావ్య ఫిల్మ్ బ్యానర్ పై నిర్మించారు.మే 5న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా భారీ విజయాన్ని అందుకుంది.


విడుదలైన పది రోజుల్లోనే ఏకంగా రూ. 44 కోట్లకు పైగా షేర్ వసూళ్లు అందుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం రూ. 52.20 కోట్లు రేంజ్ షేర్ సొంతం చేసుకుంది.11 రోజుల్లోనే 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. టోవినో థామస్, కుంచకో బోబన్, కళ్యాణ్ అరసన్, అపర్ణ బాలమురళి ఇంకా తన్వీ రామ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి ఒక రేంజిలో మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇదిలా ఉంటే ఈ మూవీని ఇప్పుడు తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ నెల 26 వ తేదీన ఈ ను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు సాయంత్రం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ జరిగింది.గీతా ఆర్ట్స్ 2 ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా వచ్చేవారం ఓటీటీలోకి రానుందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వార్తలపై స్పందించారు ప్రొడ్యూసర్ బన్నీవాసు. 2018 మూవీ నేరుగా థియేటర్లలోకి రాబోతుందని ఓటీటీలోకి కాదని ఆయన తెల్చీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: