టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. rrr చిత్ర బృందంతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్.. ఇక ఈయన భార్య ఉపాసన సైతం సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ ఒకవైపు మంచి పనులు చేస్తూ తన కుటుంబ బాధ్యతలను కూడా చాలా చక్కగా నెరవేరుస్తోంది. మరొకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు కూడా చూసుకుంటూ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుంది ఉపాసన. మరో కొద్ది రోజులలో ఇమే ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది.


పెళ్లయి 10 సంవత్సరాల తర్వాత ఉపాసన, రామ్ చరణ్ జంట తమ బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. ఈ సందర్భంగా మెగా కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటోంది. ఉపాసన, రామ్ చరణ్ బిడ్డ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని తనం కుటుంబంతో సమయాన్ని ఎక్కువగా గడుపుతున్నారు. ఉపాసన సైతం ఇంట్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటోంది.


తాజాగా ఉపాసన కొన్ని అద్భుతమైన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది తన ప్రెగ్నెన్సీ క్రైమ్ మినిస్టర్ సంబంధించి ఫోటోలను షేర్ చేసిన ఈమె సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన చీరలో ఉన్న ఫోటోలను సైతం షేర్ చేసింది.. తన ఫోన్లో ఉన్న ఇంత మంచి ఫోటోలను ఇంతకుముందు ఎందుకు పోస్ట్ చేయలేదా? ఆశ్చర్యంగా ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది.. ఈ ఫోటోలకు మహేష్ బాబు సతీమణి నమ్రత స్పందిస్తూ.. నేనే అదే చెప్పాలనుకుంటున్నాను అంటూ రిప్లై ఇవ్వగా హార్ట్ సింబల్ ని షేర్ చేసింది ఉపాసన.. ప్రస్తుతం వీరిద్దరూ చాట్ కు సంబంధించి ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: