కరోనా దెబ్బకు కథ మారిపోయింది. టాలీవుడ్లో పేరుమోసిన ఫైనాన్షియర్లందరూ కూడా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. నిర్మాతలందరికీ కాసుల కటకట మొదలైంది. బడ్జెట్లు తగ్గించుకోక తప్పని పరిస్థితి. భారీ చిత్రాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ‘హిరణ్య కశ్యప’ లాంటి రిస్కీ ప్రాజెక్టును ఇప్పుడు తలకెత్తుకోవడం అంటే సాహసమే. అందుకే సురేష్ బాబు ఆ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమే అని రుజువు చేస్తూ గుణశేఖర్ తాజాగా తననుంచి వస్తున్న ఓ లవ్ స్టొరీ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు..