అంతకుముందంటే షూటింగ్ బిజీలో ఉండి మ్యూజిక్ డైరెక్టర్ సంగతి తేల్చలేదు అనుకుందాం. కానీ ఆరేడు నెలలుగా షూటింగ్ లేదు. చిత్ర బృందమంతా ఖాళీగానే ఉంది. మరి ఈ సమయంలో ఎవరితోనూ ఎందుకు సంప్రదింపులు జరపలేదు. మ్యూజిక్ విషయంలో ఎందుకు ఏమీ తేల్చలేదు అన్నది అభిమానులకు అర్థం కావడం లేదు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఈ మాత్రం ప్లానింగ్ లేకుంటే ఎలా అన్నది ప్రేక్షకుల ప్రశ్న. ‘రాధేశ్యామ్’ ఒక ప్రేమకథ. అందులో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మనసు పెట్టి, టైం తీసుకుని సంగీతం అందించాల్సిన అవసరం ఉన్న సినిమా ఇది.