తెలుగు ఇండస్ట్రీలో కి ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మళియాలి భామ సమంత. మొదట మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన ఈ అమ్మడు తమిళంలో నటించిన చిత్రం పెద్దగా హిట్ కాలేదు..ఇక తెలుగులో నాగచైతన్య సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏం మాయ చేశావే’ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో సమంతకు వెంట వెంటనే చాన్సులు రావడం అవి కూడా మంచి విజయాలు సాధించడంతో అగ్ర హీరోయిన్ల సరసన చేరిపోయింది.
సమంత
ఇప్పుడు తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు బిజీ బిజీగా గడుపుతుంది. అయితే సమంతో గతంలో యంగ్ హీరో సిద్దార్థతో ప్రేమాయణం కొనసాగించినా అది మద్యలోనే బ్రేకప్ అయ్యింది. తర్వాత సమంతపై ఎన్నో రూమర్లు వచ్చానా అవన్నీ ఖండిస్తూ వచ్చింది. తాజాగా నేను లవ్ లో ఉన్నానని పైగా ఆ యంగ్ హీరో తో సినిమాలు కూడా చేసానని ఇక త్వరలో పెళ్లి చేసుకోవడమే తరువాయి అని సమంత చెప్పడంతో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సమంతతో లవ్ లో ఉన్న విషయాన్నీ తన పేరెంట్స్ కు చెప్పి వాళ్ళ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్న సమయంలో సదరు హీరో సమంతపై ఫైర్ అయినట్లు తెలుస్తుంది.
సమంత హాట్ పిక్స్
వాస్తవానికి ఇరు వర్గాల పెద్దలు కూడా తమ పెళ్లికి సుముఖంగా ఉన్నారని చెప్పింది. ఇదే విషయంపై ఇప్పుడు సమంత ఇరుకున పడిందట..సమంత తన లవర్ గురించి చిన్న హింట్ ఇవ్వడంతో అరకొరగా ఈ విషయం తెలిసిన వాళ్ళకు తోడూ ఇంకా చాలామంది కి తెలిసిపోయింది దాంతో సదరు హీరో ఈ అమ్మడిపై చాలా కోపంగా ఉన్నాడని సమాచారం.
తనపెళ్లి గురించి కామెంట్ చేస్తూ సమంత ట్విట్ :