దక్షిణాది సినిమా రంగంలో సారి హీరోయిన్ గా పాపులర్ క్రేజ్ తెచ్చుకున్న సమంత గత సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల లో ఒక కుటుంబం అయినా అక్కినేని వారి ఇంటికి కోడలిగా అయినా విషయం మనకందరికీ తెలిసినదే.
ప్రస్తుతం సమంత టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమా లతో షూటింగ్ లలో బిజీగా ఉంది. తమిళంలో రెండు సినిమాలతో పాటు తెలుగు, తమిళంలో `యు టర్న్` రీమేక్‌లో నటిస్తుంది.
అలాగే తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వంలో భర్త చైతుతో కలిసి నటించబోతుంది. అయితే చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత సినిమాల నుండి సమంత తప్పుకుంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. చేతిలోని సినిమాలను పూర్తి చేయడానికి ఈ ఏడాది పడుతుంది కాబట్టి.. 2019లో సమంత సినిమాలు మానేసే అవకాశం ఉంది.
అంతేకాకుండా మరోపక్క అక్కినేని కుటుంబం నుండి కూడా సమంతా ఇంకా సినిమాలకు గుడ్ బై చెబితే బాగుంటుంది అనే కామెంట్లు కూడా వినబడుతున్నాయి అని సమాచారం... మరి ఈ వార్తలపై సమంత ఏమని స్పందిస్తుందో వేచి చూడాలి.