సినిమా టైటిల్ ను బట్టి క్రేజ్ ఏర్పడిపోయే రోజులు ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్నాయి. ఇటువంటి పరిస్థులలో మరో ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈసారి ఒట్టి ప్రచారమే కాదు ఆ టైటిల్ ని ఏకంగా రిజిస్టర్ కూడా చేయించేసారు. ఇప్పుడు ఆ టైటిల్ తో ఎవరు సినిమా తీస్తారుఅనేదే ప్రశ్న. ఈ సినిమాకు కథానాయకుడు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై చిత్ర పరిశ్రమలో చర్చ కూడా సాగుతోంది. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటంటే `అనగనగా ఓ పులి`అట. దీన్ని అత్తారింటికి దారేది సినిమాను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి. వి. యస్. యన్. ప్రసాద్ రిజిస్ట్రేషన్ చేయించారు.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న ఓ సినిమా కోసమే ఈ టైటిల్ అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఈసినిమాలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తాడనీ అంటున్నారు. మరి కొద్దిమంది మాత్రం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా గురించి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారని అంటున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఈ టైటిల్ ఎవరిది అనేది సస్పెన్స్. గతంలో సల్మాన్ ఖాన్ హీరోగా `ఎక్ తా టైగర్` అనే సినిమా వచ్చీ బాలీవుడ్ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మరి ఈ ‘అనగనగా ఓ పులి’ మన టాలీవుడ్ లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి