బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పటికే ప్రారంభమై ఐదు వారాలని  పూర్తి చేసుకొని , ఆరోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ ప్రతి రోజు సరికొత్త టాస్క్ లు ఇస్తూ  , హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెడుతూ  అభిమానులని  అలరిస్తున్నాడు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఇప్పటినుండే నువ్వా నేనా అన్నట్టుగా గేమ్ లో లీనమై పోవడంతో  బిగ్ బాస్ షో  పై రోజురోజుకి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాగే ఐదు రోజులు హౌస్ మేట్స్ రచ్చ రచ్చ చేస్తే ... వీకెండ్ లో వచ్చే హోస్ట్ నాగార్జున ఈ షోని తన  అనుభవాన్ని మొత్తం ఉపయోగించి షో ని మరో లెవెల్ కి తీసుకుపోతున్నాడు. 


ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఇప్పటికే హేమ , జాఫర్ , తమన్నా , రోహిణి ఎలిమినేటి కాగా ....తాజాగా ఈ ఐదో వారం జూనియర్ సమంతగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్ళిపోయింది. దీనితో ఆరోవారం నామినేషన్ ప్రక్రియ స్టార్ చేసాడు బిగ్ బాస్. ఈ నామినేషన్ ప్రక్రియ లో  మహేష్ , రాహుల్ , వరుణ్ , హిమజ , పునర్నవి , రవి నామినేట్ అయ్యారు. కానీ , ఈ వారం నామినేట్ అయిన వారికీ బిగ్ బాస్ నామినేషన్ నుండి బయట పాడటానికి మరో అవకాశం ఇచ్చాడు. ఆరుగురిలో ముగ్గురు సీక్రెట్ టాస్క్ ఆడటానికి ఎంచుకోమన్నాడు. దీనితో నామినేషన్స్ లో ఉన్న ఆరుమంది కలిసి మాట్లాడుకొని వరుణ్ , రవి , రాహుల్ పేర్లని బిగ్ బాస్ కి తెలిపారు. వీరికి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వగా ..ముగ్గురు కూడా టాస్క్ ని చంపేశారు. సీక్రెట్ టాస్క్ లో భాగంగా రాహుల్ తనలోని మరోకోణాన్ని బయటపెట్టాడు.అలాగే వరుణ్ , వితిక ల మధ్య వివాదం ఒకానొక స్థాయిలో చాల తీవ్రంగా మారిపోయింది. అయినప్పటికీ ముగ్గురు సీక్రెట్ టాస్క్ ని పూర్తి చేయడంతో ఈ ముగ్గురిని బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ నుండి తప్పించాడు. దీనితో ఈ వారం నామినేషన్ లో మహేష్ , హిమజ , పునర్నవి లలో నుండి ఎవరు బయటకి వెళ్ళిపోతారో చూడాలి.

ఇక తాజాగా వచ్చిన ప్రోమోని గమనిస్తే ...బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ ఆరోవారానికి సంబంధించిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని ఇచ్చినట్టు అర్థమౌతుంది. ఈ టాస్క్ ఏమిటంటే ...చలో ఇండియా. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ ట్రైన్ లో ఇండియా మొత్తం చుట్టిరానున్నారు. కానీ , అది బిగ్ బాస్ హౌస్లో మాత్రమే. దీనికోసం బిగ్ బాస్ ట్రైన్ సెటప్ హౌస్ మేట్స్ కి అందించాడు. ఇక ఈ చలో ఇండియా టాస్క్ లో పునర్నవి , రవి అప్పుడే పెళ్లి అయ్యి హనీమూన్ కి వచ్చిన కపుల్స్ గా కనిపించనున్నారు. అలాగే ఈ బిగ్ బాస్ ఇచ్చిన బిగెస్ట్ టూర్ లో అందమైన అమ్మాయి గా శ్రీముఖి ఉండబోతుంది. ఇక రాహుల్ , వరుణ్ లు ట్రైన్స్ డైవర్ , కండక్టర్ గా ఉండనున్నారు. హౌస్లో ఎప్పుడు కిచన్ లో ఉండే బాబా భాస్కర్ ఈ టాస్క్ లో కూడా టీ మాస్టర్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రోమో చూస్తుంటే ఈ  టాస్క్  లో రవి , పునర్నవి జంటే హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: