ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలు మొదటిగా బిజెపికి అనుకూలంగా వచ్చినట్లు వచ్చి అధికారం చేతి దాక వచ్చినట్లు వచ్చి చేజారిపోయిన విషయం అందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ-శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేసి చాలా రోజులు అయిన నేపథ్యంలో ప్రస్తుతం మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరుగురు మంత్రులతో మంత్రివర్గాన్ని ఉద్ధవ్ ఠాక్రే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఆరుగురు సభ్యుల లో స్టార్ హీరోయిన్ టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జెనీలియా బావ మంత్రి అయ్యే అవకాశాన్ని దక్కించుకోవడం జరిగింది.

 

లాతూర్ సిటీ నుండి వరుసగా మూడవసారి నెగ్గిన అమిత్ దేశ్ ముఖ్ జెనీలియా బావ. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ-శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటంతో కాంగ్రెస్ పార్టీ తరఫున లాతూర్ సిటీ నుండి వరుసగా మూడవసారి నెగ్గిన అమిత్ దేశ్ ముఖ్ నేడు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీనుండి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఈ ల్లో దేశ్ ముఖ్ కుటుంబ సభ్యులు కూడా పోటీ చేశారు. అమిత్ దేశ్ ముఖ్(కాంగ్రెస్) లాతూర్ లో, ధీరజ్ దేశ్ ముఖ్లా తూర్(గ్రామీణం)లో నామినేషన్లు వేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో వారి సోదరుడు ప్రముఖ హీరో   రితేష్ దేశ్ ముఖ్, అతడి భార్య జెనీలియా ప్రచారం చేశారు.

 

వారు పోటీ చేసిన నియోజకవర్గాలకు వెళ్లి తమవంతుగా ప్రచారం చేశారు. పోలింగ్ రోజు రితేష్, జెనీలియాలతో పాటు మొత్తం కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దీంతో ఆ సందర్భంలో జరిగిన ఎన్నికలలో జెనీలియా బావ గెలవడంతో తాజాగా మంత్రివర్గంలో మంత్రి స్థానం దక్కించుకోవడం తో ప్రస్తుతం జెనీలియా ఆనందానికి అవధులు లేవు. మరొక్క జెనీలియా భర్త హీరో రితేష్ దేశ్ ముఖ్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తన సోదరుడు మంత్రి అయిన నేపథ్యంలో తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. స్వతహాగా హీరో రితేష్ దేశ్ ముఖ్ కుటుంబం మొత్తం రాజకీయ కుటుంబం అయిన నేపథ్యంలో హీరో రితేష్ దేశ్ ముఖ్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: