వర్ధమాన నటి మాధవి లత మన తెలుగు వారందరికీ ఎంతో సుపరిచితం. మొదటగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతిథి సినిమా ద్వారా తెలుగు తెరకు నటిగా పరిచయం అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన మాధవీలత మంచి పేరు దక్కించుకుంది. ఇక ఆ తరువాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే సినిమాలో నటించి హీరోయిన్ గా కూడా మంచి పేరు దక్కించుకుంది. అనంతరం అక్కడక్కడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన మాధవి లత, తన ఫస్ట్ సినిమా అతిథి విషయమై జరిగిన ఒక చిన్నపాటి వివాదం పై కొద్దిరోజుల క్రితం ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, అతిథి షూటింగ్ సమయంలో తన సీన్ షూట్ టైం లో తాను సెట్ కు కాస్త లేట్ గా వచ్చానని, అయితే దానిని పట్టుకుని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తనను ఎంతో మంది జనం మధ్య దుర్భాషలాడారని మాధవీలత చెప్పుకొచ్చింది. 

 

అయితే ఈ మొత్తం ఘటన జరుగుతున్న సమయంలో మహేష్ బాబు ఎదురుగా ఉన్నా మాట్లాడకపోవడం తనకు నచ్చలేదని ఆమె చెప్పింది. దానితో ఆమె మహేష్ పై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే అనంతరం మరొక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ, మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడుగగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పిన మాధవి లత, మొదటి నుండి నేను పవన్ కు వీరాభిమానని చెపుతూనే ఉన్నాను కాదండి అని అన్నది. ఇక ఆ ఇంటర్వ్యూలో, మహేష్ బాబు టాలీవుడ్ అందగాడు కదా, ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, మహేష్ అందగాడు అయితే అయి ఉండవచ్చు, మనకు అటువంటివి ఏమి ఉండవు, నేను పవన్ కు వీరాభిమానిని అంతే అని చెప్పుకొచ్చింది. అయితే గత కొద్దిరోజులుగా ఆమె మాట్లాడిన ఆ మాటలను కొందరు మహేష్ ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తూ, నీకు మహేష్ అంటే ఇష్టం లేనపుడు సైలెంట్ గా ఉండాలి.....!!. 

 

అసలు అతిథి షూటింగ్ జరుగుతున్న సమయంలో నిన్ను అసిస్టెంట్ డైరెక్టర్ అన్న మాటలు నిజంగా మహేష్ దగ్గరి నుండి విన్నారా లేదా, ఎందుకంటే మహేష్ మాత్రమే కాదు, దాదాపుగా ఏ హీరో అయినా తమకు ఎదురుగా ఒక నటిని అలా అంటుంటే ఊరుకోరని, అలానే నీకు పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం ఉండొచ్చు తప్పులేదు, అంతేకాని నిన్ను అడిగిన ప్రశ్నకు మహేష్ అందగాడు అయితే అయి ఉండొచ్చు, మనకు అవన్నీ లేవు అంటూ వ్యంగ్యంగా ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఈ విషయమై పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, దాదాపుగా ఏ హీరో అభిమాని కూడా నువ్వు మాట్లాడే పద్దతిని ఇష్టపడరు అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో మాధవి లతపై విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో జరిగిన ఈ ఘటనపై ప్రస్తుతం మరికొందరు ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం మాధవి వ్యాఖ్యలను తప్పుపడుతుండడం విశేషం.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: