మీ టూ టాపిక్ తో సౌత్ లో రచ్చ రచ్చ రేపిన శ్రీ రెడ్డి.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ నానా రచ్చ చేస్తూనే ఉంది. ఈ మద్యే హీరో నాని పై పలు విమర్శలు చేయడంతో నాని పోలీస్ కేసు పెట్టడం .. ఆ తరువాత శ్రీ ముఖి కూడా నాని పై కంప్లైంట్ చేయడం .. జరిగింది. కొన్ని రోజులుగా ఈ రచ్చ ఆగిపోయింది అనుకుంటే .. తాజాగా శ్రీ రెడ్డి మళ్ళీ హీరో నాని ని టార్గెట్ చేసింది. నాని తాజాగా నిర్మించిన హిట్ సినిమా గురించి సంచలన కామెంట్స్ చేసింది.
విశ్వక్ సేన్, రుహాణి శర్మ జంటగా నాని నిర్మించిన హిట్ సినిమా నిన్న విడుదలైంది. అయితే ఈ సినిమా గురించి శ్రీ రెడ్డి కౌంటర్లు వేస్తూ హిట్టా ఫట్టా .. నూని గాడు .. ఓ బూమ్ ఫట్ అంటగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఈ కామెంట్స్ విషయంలో కొందరు శ్రీ రెడ్డి పై ఫైర్ అవుతున్నారు. కావాలనే నాని ని కెలుకుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొందరేమో నిజమే సినిమా యావరేజ్ అనే టాక్ తెచ్చుకుంది. కొందరు బాగుందంటే.. చాలా మంది మాత్రం బాగాలేదని అంటున్నారు. మరి ఈ విషయంలో నాని ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.
ఆల్రెడీ గతంలో నిని శ్రీరెడ్డి పై పోలీస్ కేసు పెట్టినప్పటికీ శ్రీరెడ్డి నానిని మాత్రం వదిలిపెట్టడం లేదు. ఏదో ఒక విషయంలో కెలుకుతూనే ఉంది. మరి ఈ సారి ఈ అమ్మడు చేసిన కామెంట్స్ కి నాని ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. అయితే ఈ సినిమా మాత్రం కాస్త డివైడ్ టాక్ని మూటగట్టుకుంది. కాని ఎక్కువశాతం ప్రేక్షకులు మాత్రం సినిమా చాలా బావుందనే అంటున్నారు. ఎక్కడో ఒకరిద్దరు తప్పించి ఆల్మోస్ట్ సినిమాకి మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. హిట్ సినిమా హిట్ ఖాతాలో ఆల్రెడీ పడిపోయింది.