హాస్య నటుడు ఐరన్ లెగ్ శాస్త్రి అసలు పేరు గునుపూడి విశ్వనాధ శాస్త్రి. ప్రముఖ హాస్యనటుడిగా పేరు పొందారు. ఈయిన పురోహితుడిగా అనేక సినిమాల్లో నటించారు. పురోహితుడిగా పని చేస్తున్న శాస్త్రి గారికి సినిమాల్లో అవకాశం కల్పించాడు ఇ.వి.వి. సత్యనారాయణ. ఐరన్ లెగ్ శాస్త్రి నటించిన మొదటి సినిమా అప్పుల అప్పారావు.
 
 
ఈ సినిమాతో ఐరన్ లెగ్ శాస్త్రి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. ఇలా తను సినిమాల్లో కి  ప్రవేశం చేసాడు.  ఐరన్ లెగ్ శాస్త్రి వివిధ సినిమాల్లో పురోహితుడి పాత్రల్లో కనిపించాడు. చక్కగా హాస్యాన్ని పండిస్తూ నవ్విస్తాడు. ఐరన్ లెగ్ శాస్త్రి తాడేపల్లి గూడెం లో జన్మించాడు. పురోహితుడిగా పని చేస్తున్న శాస్త్రి సినిమాల్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
 
 
మంచి పాత్రలని పోషించి తెలుగు ప్రేక్షకులని నవ్వించాడు ఈ హాస్య నటుడు. ఐరన్ లెగ్ శాస్త్రి నటించిన పలు సినిమాలు చెప్పుకో దగినవి. ప్రేమ ఖైదీ, అప్పుల అప్పారావు, ఏవండీ ఆవిడ వచ్చింది, జంబలకడిపంబ లో ఐరన్ లెగ్ శాస్త్రి పాత్ర ముఖ్యమైనది. ఈయిన చక్కటి మాటతో హాస్యాన్ని పండించి, ప్రేక్షకులని నవ్విస్తాడు.
 
 
 
 
2006 నుండే గుండెకి సంబంధించిన వ్యాధితో బాధ పడ్డారు. అదీ కాకుండా పచ్చ కామెర్లు తో కూడా ఆయిన బాధ పడ్డాడు. అయితే ఆర్ధికంగా ఇబ్బందులు కూడా ఉండడం వల్ల ఎంతగానో చింతించాడు. చివరి రోజుల్లో కుటుంబం ప్రభుత్వాన్ని సాయం అడిగినా పరిష్కారం లేకపోయింది.
 
 
సంపూర్ణేష్ బాబు 25000 సాయం చేసాడు అలానే హీరో సందీప్ కిషన్ కూడా కొంత సాయం చేసాడు. కానీ శాస్త్రి గారు తన స్వస్థలం తాడేపల్లి గూడెంలో మరణించారు. చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందిపడడం నిజంగా బాధాకరం
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: