విలక్షణ దర్శకుడు పూరి జగన్నాద్ తనకు ఎవరైనా నచ్చితే చాలు ఆ వ్యక్తిని వదలడు అని అంటారు. వారు సాంకేతిక నిపుణులు కావచ్చు లేదంటే క్రేజీ హీరో హీరోయిన్స్ కావచ్చు. అందుకే పూరితో కలిసి పనిచేయడానికి అందరూ ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. ఎంతోమంది యంగ్ టాలెంట్‌ని పూరి తెరకు పరిచయం చేశాడు.
వాళ్లు ఇప్పుడు పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆమధ్య నిర్మాత బండ్ల గణేష్ పూరి కోసం ఒక డైమండ్ సిగర్ లైటర్ ను గిఫ్ట్ గా ఇస్తే అప్పుడు ఆ వార్త సంచలనంగా మారింది. ఇలా ఎప్పుడూ తానే తీసుకోకుండా పూరి తనతో పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన భాస్కరభట్ల రవికుమార్ కు ఒక అరుదైన గిఫ్ట్ ఇచ్చి సంచలనం సృస్టించాడు.
పూరి సినిమాలలో భాస్కరభట్ల పాటలు లేకుండా సినిమాలు ఉండవు. ఇటీవల తీసిన `హార్ట్ ఎటాక్` సినిమాకి కూడా పాటలన్నీ ఆయనే రాశారు. ఈ సినిమాకి భాస్కరభట్ల పాటలు అందించిన విధానం పూరికి చాలా బాగా నచ్చిందట. అంతేకాదు ఈ సినిమాకి పాటలే ప్రత్యేక ఆకర్షగా నిలిచాయని పూరి ప్రతీ ప్రెస్‌మీట్‌లోనూ పూరి చెబుతూ వస్తున్నాడు. అందుకే భాస్కరభట్లకి గిఫ్ట్ గా ఏదైనా ఇవ్వాలనుకొన్నారట పూరి.
అందుకోసం 1.50లక్షల ఖరీదైన మౌంట్ బ్లాక్ పెన్‌ని కొనుగోలు చేసి భాస్కరభట్లకి బహుమానంగా ఇచ్చి ఆశ్చర్య పరిచాడట పూరి. ఆ పెన్నుతో మరిన్ని మంచి పాటలు రాయాలని కోరుకొంటున్నా అన్నారు పూరి. పూరి ‘హార్ట్ ఎటాక్’ సినిమా హీరో నితిన్ కు ఆశించిన అదృష్టాన్ని ఇవ్వలేకపోయినా భాస్కరభట్లకు మాత్రం ‘హార్ట్ ఎటాక్’ అనుకోని అదృష్టాన్ని ఇచ్చిందనే అనుకోవాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: