తక్కువ సమయంలో జాతీయ ఉత్తమ నటి అనిపించుకుంది ప్రియమణి. అందం.. అభినయం.. ఉన్న హీరోయిన్ దొరికిందనుకున్నారు. ఇలా అనుకున్నంత సేపు కాలేదు ఫేడౌట్ కావడానికి. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న రోల్స్ ఎంచుకుంది. గురువారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన రెండు స్టిల్స్ సినీజనాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

 

36వ ఏట అడుగుపెట్టిన ప్రియమణి తెలుగులో కనిపించి చాలా కాలం అయింది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. పెళ్లైన కొత్తలో.. యమదొంగ తప్ప మరో సక్సెస్ లేని ప్రియమణి ఛాన్సులకు దూరమైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని నారప్పతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వెంకటేశ్ భార్యగా నటిస్తోంది. పల్లెటూరు అమ్మాయిగా కనిపించే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకుంది. మరో సినిమా విరాటపర్వంలో నక్సలైట్ భారతక్కగా నటిస్తోంది ప్రియమణి. 

 

రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న విరాటపర్వంలో ప్రియమణి నక్సలైట్ భారతక్కగా డిఫరెంట్ రోల్ తో వస్తోంది. ప్రియమణి ఫస్ట్ లుక్ ను రానా రిలీజ్ చేశాడు. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచి విప్లవంలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం అని రానా ట్వీట్ చేశాడు. 

 

తమిళంలో నటించి ప్రస్తుతం పరుత్తి వీరన్ తో జాతీయ ఉత్తమ నటి అనిపించుకున్న ప్రియమణికి ఆ తర్వాత పెర్ ఫార్మెన్స్ రోల్స్ పడలేదు. ఆ మధ్య ప్రకాశ్ రాజ్ దర్శకత్వంలో నటించిన మన ఊరి రామాయణంలో వేశ్యగా నటించింది. సినిమా ఫ్లాప్ కావడంతో.. తెలుగులో కనిపించలేదు. సినిమా ఛాన్సులు లేకపోయినా.. పలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కు జడ్జిగా వ్యవహరించిన ప్రియమణి.. ది ఫ్యామిలీ మేన్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. నారప్ప.. విరాఠపర్వంలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ప్రియమణి. 

మరింత సమాచారం తెలుసుకోండి: