ఎక్స్ పోజింగ్ చేయకుండా నేటి యాంకర్లు రాణించలేరా? అంటే రాణించలేరనే చెప్పాలి. ఎందుకంటే యాంకర్ గా రాణించాలంటే టాకింగ్ టాలెంట్ తో పాటు ఎక్స్ పోజింగ్ చేసే టాలెంట్ కూడా ఉండాలి. తెలుగులో చాలా మంది టాలెంటెడ్ యాంకర్లు ఉన్నా కానీ అనసూయ, రశ్మి, శ్రీముఖి వంటి టాప్ యాంకర్స్ లిస్టులో చేరకపోవడానికి కారణం అదే. యాక్చువల్ గా చూసే ప్రేక్షకులకి గ్లామర్ ని అలవాటు చేసింది షో నిర్వహకులే. నిజానికి కామెడీ షోస్ లో గ్లామర్ అవసరం లేదు. యాంకర్స్ తో ఎక్స్ పోజింగ్ చేయించాల్సిన అవసరం అంతకంటే లేదు. కాసేపు కామెడీ పంచులు విని నవ్వుకుని వెళ్ళేవాళ్ళే ఎక్కువ. చాలా తక్కువ మంది మాత్రమే యాంకర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కేవలం ఆ తక్కువ మంది కోసమే షో నిర్వాహకులు టార్గెట్ చేసి యాంకర్లతో ఎక్స్ పోజింగ్ చేయిస్తున్నారు. 


ఇది తప్పా, రైటా అన్నది పక్కన పెడితే షోలు మాత్రం హిట్ అవుతున్నాయి. కేవలం వాళ్ళ ఎక్స్ పోజింగ్ వల్లే షో హిట్ అవుతుందంటే ఎవరూ ఒప్పుకోరేమో. ఎక్స్ పోజింగ్ వల్ల కాదు, తమ టాలెంట్ తోనే స్టార్స్ అయ్యారని అంటే ఎక్స్ పోజింగ్ చేయడం దేనికి అన్న ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి. 


మితిమీరిన ఎక్స్ పోజింగ్ తో యూత్ ను రెచ్చగొట్టి, ఆ పై వారు పెట్టే అసభ్యకర కామెంట్స్ కి బాధపడడం వల్ల కూడా ప్రయోజనం లేదు. ఇది ఎలా ఉంటుందంటే నీ ముందు బెల్లీ డాన్స్ చేస్తాను, నువ్వు చూడకూడదు అన్నట్టు ఉంటుంది. కుదురుగా పప్పన్నం తినే వాడి ముందు బిర్యానీ పెడితే లొట్టలేయకుండా ఎలా ఉంటాడు. ఖచ్చితంగా లొట్టలు వేస్తాడు. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు పబ్లిక్ గా కామెంట్స్ పెడతారు. పద్ధతి ఉన్న వాళ్ళు అయితే మన సంస్కృతిని చెడగొడుతున్నారని తిడతారు. కానీ పబ్లిక్ గా ప్రదర్శించినప్పుడు అందరూ చూస్తారు, ఏదో ఒక కామెంటో, కాంప్లిమెంటో ఇవ్వడం మామూలే. పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. పళ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. అందుకే తెలుగులో ఇప్పటివరకూ లాస్య, మంజూష వంటి యాంకర్లు రాళ్ళ దెబ్బలు తినలేదు. అయితే సుమ, ఝాన్సీ, ఉదయభాను వంటి వాళ్ళు ఎక్స్ పోజింగ్ అన్న కాన్సెప్ట్ కి దూరంగా ఉంటూ, కేవలం యాంకరింగ్ తోనే తమ సత్తా చాటారు. వీళ్ళకి ఎలాంటి రాళ్ళ దెబ్బలు తగల్లేదు. నేడు ఎందుకు తగులుతున్నాయంటే అది అందరికీ తెలుసు. 


అయితే ఎక్స్ పోజింగ్ చేయకుండా యాంకర్లుగా కొనసాగుతారా అంటే ఇప్పుడు సాధ్యం అయ్యే పని కాదు. అలా అని ఆడియన్స్ అందరూ కేవలం ఎక్స్ పోజింగ్ నే చూస్తారంటే తప్పు. ఎందుకంటే ఏ ప్రేక్షకుడూ తనకు ఏది కావాలో ఎప్పుడూ టి‌వి ఆఫీసులకి వెళ్ళి అడగడు. టి‌విలో ఏది వస్తే అదే చూస్తాడు. కాబట్టి యాంకర్లని ఎలా చూపించాలి అనేది కేవలం షో నిర్వహకుల మీదే ఉంటుంది. ఈ మధ్య తెలుగు బుల్లితెర మీద ఎక్స్ పోజింగ్ డోస్ మరీ పెరిగిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. కామెడీ షోస్ లోనూ ఇదే తంతు, మిగతా షోస్ లోనూ అదే తంతు. ఆఖరికి పండగ పూట వచ్చే కార్యక్రమాల్లో కూడా ఇదే ట్రెండు నడుస్తుంది. ఏది ఏమైనా గాని సాంప్రదాయబద్ధంగా ఉండే యాంకర్లు నేడు స్టార్లుగా రాణించలేరన్నది వాస్తవం. ఇప్పుడు యాంకర్లుగా రాణించాలంటే ఎక్స్ పోజింగ్ అనే క్వాలిఫికేషన్ ఉండాలి. మరి ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసే మరో సుమ వస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: