బాలకృష్ణకు ఆవేశం వస్తే చేసే వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి సందర్భమే మరొకసారి వచ్చింది. ‘సెహరి’ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా బాలయ్య కరోనా వ్యాక్సిన్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ప్రకృతిని మనం అతిక్రమిస్తే అది మనకు ఎలాంటి తీవ్రమైన సమాధానం చెపుతుంది అన్న విషయానికి ఉదాహరణ ప్రస్తుత కరోనా సమస్య అని బాలయ్య అభిప్రాయ పడ్డాడు.


కరోనా కి వ్యాక్సిన్ ఇప్పట్లోరాదని చెపుతూ భక్తి ఛానల్ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉదయమే నిద్రలేచి చన్నీళ్ళతో స్నానం చేయమంటారని అలా ఎవరు చేయవద్దని దీనివల్ల నిమోనియా వస్తుందని కరోనా నిమోనియాకు సంబంధించిన వ్యాధి అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రపంచంలో ఇంతవరకు నిమోనియాకు వ్యాక్సిన్ రాలేదనీ అలాంటిది ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ ఎలా వస్తుంది అంటూ బాలయ్య ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు.


ప్రతి వ్యక్తి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ వేడి నీళ్ళతో స్నానం చేసి ఉప్పు నీళ్ళతో నోటిని పుక్కిలించి ఊసి ప్రతిరోజు ఆవిరి పడితే ఏవ్యక్తికి ఎట్టి పరిస్థితులలోను కరోనా రాదు అన్న ఆరోగ్య సూత్రాన్ని బాలయ్య చెపుతున్నాడు. అంతేకాదు కరోనా మన నుంచి వెళ్ళిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందనీ దీనితో పాటే మనం బతకాలని బాలయ్య అభిప్రాయం. ప్రజాసేవ తన రక్తంలో ఉందనీ అధికారంలో ఉన్నా లేకపోయినా తానెప్పుడు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను అంటూ బాలయ్య తన మనోభావాన్ని బయటపెట్టాడు.


అయితే కరోనా విషయంలో ఇన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పిన బాలకృష్ణ మాత్రం ఈసినిమా ఫంక్షన్ కు చేతికి పొలితిన్ గ్లోజస్ వేసుకుని రావడం ఆశ్చర్య పరిచింది. అంతేకాదు వేదిక పై ఉన్న బాలయ్యకు ఒక ఫోన్ కాల్ వస్తే ఆ ఫోన్ నెంబర్ చూసి బాలకృష్ణఫోన్ కు ఆన్సర్ చేయకుండా తన చేతిలోని ఫోన్ ను తన ఫోన్ తన పిఎ చేతిలోకి విసరడం చూసినవారు ఆశ్చర్యపడటమే కాకుండా ఇక బాలయ్య తీరు మారదా అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: