టాలీవుడ్ మాయలేడి సమంతకు కోపమొచ్చింది. ఒక జాతీయ స్థాయి ఇంగ్లీష్ పత్రికపై విరుచుకు పడుతోంది సమంత తన కోపాన్ని11ట్వీట్ల రూపంలో పెట్టి ఆ పత్రికను ఏకిపారేసింది ఈ క్యూట్ హీరోయిన్. అసలు ఈ కోపానికి కారణం ఏమిటీ అనుకుంటున్నారా? దీనివెనుక పెద్ద కధే ఉంది. దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ ల స్టయిల్‌ను సమంత కాపీ కొడుతోందంటూ ఆప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.  అంతే కాదు మొన్న ‘అల్లుడు శీను’ ఆడియో వేడుకకు సమంత వేసుకొచ్చిన డ్రెస్ డిజైన్ దీపిక గతంలో వేసుకున్న ఫాషన్ డిజైన్ కు కాపీగా ఉందని సమంత డ్రెస్ పై కామెంట్స్ రాయడంతో సమంత కోపంతో ఉఉగిపోతు "మీ ఆఫీసులోని వారికి ఫ్యాషన్స్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ తో ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను ఎప్పుడైతే ఒక డిజైనర్ ఒక కలెక్షన్ తో వస్తారో అప్పుడే వాళ్ళ దగ్గర ఆ సీజన్ కి సరిపోయేలా ఒకే డిజైన్ వేరు వేరు కలర్స్ లో ఉంటాయి. అంతర్జాతీయం కాకుండా జాతీయ గుర్తింపు ఉన్న లేబుల్స్ అయితే వాటిలో ఎప్పుడు సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే ఉంటాయి. అనామిక ఖన్నా ధోతీ స్టైల్, అర్పిత కట్ వర్క్ బ్లౌస్ స్టైల్ ఇలా ఇవన్నీ ఒక్క సెలబ్రిటీ కోసం ఒక్క పీస్ మాత్రమే తయారు చెయ్యరు. అవే మోడల్స్ షాప్స్ మరియు ఆన్ లైన్ లో కూడా దొరుకుతాయి" అని అంటూ ఆ ఆంగ్ల దిన పత్రిక పై ట్విటర్  యుద్ధం మొదలు పెట్టింది.   అంతే కాదు  నేషనల్ లెవల్లో ప్రముఖ ఫ్యాషన్ బ్లాగ్స్ మరియు వెబ్ సైట్స్ అయిన హైహీల్స్, పింక్ విల్లా, మిస్ మాలిని లాంటి వారు తన స్టైల్ ను పొగుడుతూ ఉంటే తనను దీపిక, సోనం కపూర్లతో పోల్చడమేమిటి అంటూ ఆ ప్రముఖ ఆంగ్ల దిన పత్రికను టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ఆమధ్య మహేష్ ను టార్గెట్ చేసిన సమంత ఈ సారి ఏకంగా నేషనల్ మీడియాను టార్గెట్ చేయడం ఆశ్చర్యకరమైన విషయమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: