నయనతార వరుసగా సినిమాను చేస్తూ బిజీ ఆయ్యారు .. ఇటీవలే ఆమె అమ్మోరు తల్లి అనే సినిమాతో ముందుకు వచ్చారు .. ఆ సినిమా మంచి విజయం సాధించడం తో తన తదుపరి సినిమాలపై దృష్ట్టి పెట్టింది .. అయితే తాజాగా ఆమె ఒక చిత్రం లో నటిస్తుంది ఆ సినిమాకి సంబందించిన స్టిల్స్ బయటికి వచ్చాయి ... ఆ స్టిల్స్ లో నయనతార ని చూస్తే ఆమె ఒక విభిన్న మైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది .. మరి ఆ చిత్ర విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..

 దక్షిణాది లేడి సూపర్ స్టార్ పేరొందిన  నయనతార. ప్రస్తుతం  మిలింద్ రావ్ దర్శకత్వంలో నెట్రికాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది నయనతార గారి  65వ చిత్రం ... ఈ చిత్రాన్ని  తమిళ  దర్శకుడు   విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార మొదటిసారిగా  అంధురాలి పాత్రలో చేస్తున్నారట .. ఈ మధ్యనే   విడుదలైన టీజర్ అందరినీ తెగ ఆకట్టుకుంది. అందులో అంధురాలిగా నయన్ పాత్ర అద్భుతంగా ఉంది . ఇక ఈ మూవీ నుంచి తాజాగా మరిన్ని స్టిల్స్ బయటికి వచ్చాయి .వీటిని చూసిన అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి....

మొత్తానికి ఈ స్టిల్స్ ను చూస్తుంటే నయనతార  మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అర్థం అవుతుంది ..  ఇక ఈ  మూవీతో పాటు నయనతార ఒక మలయాళంలో  చిత్రంలోను  నటిస్తుంది .. దాంతో పాటు నయనతార సూపర్ స్టార్ రజనీకాంత్  అన్నాత్తే మూవీలోను  నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకుంటుంది .. ఇప్పుడు నయనతార  చేతినిండా సినిమాలు బిజీగా మారనుంది .. అయితే నయన్ తెలుగులో చివరిగా చిరంజీవి తో సైరా లో నటించింది .. అందులో తను చేసింది చిన్న పాత్ర అయినా మంచి గుర్తింపు లభించింది .. నయనతార తమిళ్ తో పాటు తెలుగు సినిమాలకి చేయాలనీ తెలుగు అభిమానులు కోరుతున్నారు ..    


మరింత సమాచారం తెలుసుకోండి: