మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఉప్పెన సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలై చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటికీ థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి. ఈ సినిమాని రూ. 25 కోట్లతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా ప్రస్తుతం థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారానే దానికి రెట్టింపు షేర్ వస్తోంది. థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారా మాత్రమే కాదు శాటిలైట్ రైట్స్ డిజిటల్ రైట్స్ రీమేక్ రైట్స్.. ఇంకా తదితర హక్కులను అమ్ముకోవడం ద్వారా చిత్ర నిర్మాతలకు 45 కోట్ల లాభం ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ లాభాల్లో డైరెక్టర్ సుకుమార్ కి వాటా రానున్నది.


వాస్తవానికి ఉప్పెన సినిమాకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కథ అందించడంతో పాటు డైలాగులు రాసుకోవడం కూడా బుచ్చి బాబే చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉప్పెన సినిమాకి సంబంధించి సుకుమార్ పెద్దగా చేసిందేమీ లేదు. ఆయన ఈ సినిమాలో పెట్టుబడి కూడా పెట్టలేదు. కానీ కథ గురించి జరుగుతున్న చర్చల్లో కీలకంగా వ్యవహరించారు. బుచ్చిబాబు రాసిన స్క్రిప్ట్ లో అనవసరమైనవి కట్ చేసి దాన్ని మంచి స్టోరీ గా తీర్చి దిద్దారు. సినిమా రూపొందిస్తున్న సమయంలో కూడా పర్యవేక్షించారు.


తన శిష్యుడు బుచ్చిబాబు తొలిసారిగా దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాకి సుకుమార్ చాలా విషయాల్లో అండగా ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి ప్రచారం చేయడానికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ని చిత్ర బృందం వాడుతోంది. మొత్తంగా చూసుకుంటే స్క్రిప్టు విషయంలోనూ మరియు ప్రచార కార్యక్రమాల్లో సినిమాకి ఉపయోగపడినందుకు గాను సుకుమార్ కి నిర్మాతలు రూ. 10 కోట్ల ఇచ్చేశారని సమాచారం. ఏది ఏమైనా పెద్దగా కష్టపడకుండానే సుకుమార్ 10 కోట్ల రూపాయలు సంపాదించడం విశేషం.


అయితే ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సుకుమార్ మరియు ఆయన శిష్యుడు బుచ్చిబాబు కి మంచి క్రెడిట్ దక్కుతోంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లకు కూడా గుర్తింపు దక్కింది. వాళ్ళు తమ తదుపరి సినిమాల కోసం కోట్లలో, లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ బాగా లాభపడుతున్నారు. ఏది ఏమైనా ఉప్పెన సినిమా అందరికీ మంచే చేసిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: