అటు హీరోయిన్ గానే కాదు ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మరోవైపు విలన్  గా నటిస్తూ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. ఈమె ఏ పాత్రలోనైనా సరే..ఇట్టే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తుంది.. అంతేకాకుండా ఇటీవల ఈమె నటించిన సినిమాలు రెండూ మంచి సూపర్ హిట్ ను అందుకున్నాయి. అయితే 2021 ఓపెనింగ్ వరలక్ష్మి శరత్ కుమార్ కు అదృష్టాన్ని తెచ్చి పెట్టింది.. అంతేకాకుండా వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న హీరోలకు కూడా ఒక అదృష్టదేవత లాగా మారిపోయింది..


వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు "క్రాక్ " సినిమా ద్వారా జయమ్మ పాత్రలో విలన్ గా నటించి, మంచి హిట్ టాక్ ను అందించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైనప్పటికీ ప్రస్తుతం ట్రెండింగ్ మూవీ గా నడుస్తోంది.. గత ఎనిమిది సంవత్సరాలుగా అసలు తన సినీ కెరీర్లో ఒకటంటే ఒకటి హిట్ అంటూ లేని అల్లరి నరేష్ జీవితానికి సరికొత్త నిర్వచనం చూపించింది. నాంది సినిమాలో లాయర్ గా ఆధ్యా పాత్రలో నటించి, అపోజిషన్ లాయర్ కి చెమటలు పట్టించింది. నిజంగా లాయర్ వచ్చి నరేష్ తరఫున వాదిస్తోందేమో అని చూసినవారంతా అనుకునే లాగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించింది. నరేష్ కు సూపర్ హిట్  ను అందించింది ఆధ్యా..


ఇక ఇటీవల మరో సరికొత్త పాత్రలో కనిపించడానికి వరలక్ష్మి శరత్ కుమార్ ఓకే చేసిందట.. ఇంతకు ఆ పాత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 2021 అలా మొదలైందో లేదో అప్పుడే తన అకౌంట్లో తెలుగు సినిమా స్క్రీన్ మీద రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను తన అకౌంట్లో వేసుకుంది... సినిమాల్లో హీరోయిన్ అంటే చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని, నాలుగు సీన్లు, ఐదు పాటలకు డాన్సులు వేసే బాపతి నేను కాదని ఇప్పటికే తన సెలెక్షన్ ద్వారా చెప్పకనే చెబుతోంది వరలక్ష్మి శరత్ కుమార్.. అందుకే ఈమెను ఒక క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యే ఎంతో మంది దర్శకులు చాలా జాగ్రత్తగా వరలక్ష్మి కోసం కథను కూడా రాసుకుంటున్నారట .


అందులో భాగంగానే డార్లింగ్ సినిమా దర్శకుడు స్వామి కూడా ఈమె కోసం ఒక సొంత కథను రాసుకున్నారు. అందులో వరలక్ష్మి క్యారెక్టర్ మామూలుగా లేదు. అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఒకవైపు నవ్విస్తుంది,మరొకవైపు థ్రిల్లింగ్ చేస్తుంది.  ఇన్ని వెరైటీస్ వున్న క్యారెక్టర్ విన్న వరలక్ష్మి ఒక్కసారిగా స్వామికి ఓకే చెప్పేసిందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నారు స్వామి..

మరింత సమాచారం తెలుసుకోండి: