ఫీల్ మై
లవ్, యు రాక్ మై వరల్డ్, ఏదో ప్రియరాగం వింటున్నా వంటి పాటలు ఎప్పటికీ ఎవర్గ్రీన్ సాంగ్స్ గా నిలిచిపోవడానికి కారణం వాటిని కంపోజ్ చేసిన దేవిశ్రీప్రసాదే అని చెప్పవచ్చు.
ఆర్య తోపాటు
ఆర్య 2 సినిమాకి కూడా
దేవిశ్రీప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ రెండు సినిమాలకి
సుకుమార్ దర్శకత్వం వహించాగా..
అల్లు అర్జున్ హీరోగా నటించారు. అయితే
దేవిశ్రీ ప్రసాద్,
సుకుమార్,
అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల పాటలు గానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గాని అదిరిపోయిందనే చెప్పుకోవాలి. ఇటీవల
సుకుమార్,
దేవిశ్రీ ప్రసాద్ కాంబో లో వచ్చిన రంగస్థలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా రోమాలు నిక్క పొడిచేలా చేసింది. నిజానికి దేవిశ్రీ..
సుకుమార్ సినిమాల కోసం చాలా కేర్ తీసుకుంటారు. ఇప్పటి వరకు వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల
ఆడియో అవుట్ పుట్ గమనిస్తే ఆ విషయం ఎవరికైనా అర్థం అవుతుంది.
అయితే ఇప్పుడు
దేవిశ్రీప్రసాద్,
సుకుమార్ కలసి పుష్ప
సినిమా కోసం పని చేస్తున్నారు. దీంతో
దేవిశ్రీప్రసాద్ ఎటువంటి మ్యూజిక్ అందించానున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పుష్పరాజ్ పాత్రకు సంబంధించిన ప్రేలూడ్ (పరిచయ భాగము) విడుదల అయింది.
అల్లు అర్జున్ అభిమానులు పుష్ప సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండడంతో మైత్రి
మూవీ మేకర్స్ తాజాగా ప్రేలూడ్ ఆఫ్ పుష్పరాజ్ పేరిట 19 సెకండ్ల నిడివిగల ఒక వీడియో క్లిప్ విడుదల చేశారు.
అయితే ఈ వీడియో క్లిప్ లో వినిపించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పూనకాలు తెప్పిస్తోంది. దీనితో మళ్లీ
సుకుమార్ సినిమాకి
దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ సమాకురుస్తున్నారని స్పష్టమవుతోంది. ఇప్పటికే ప్రేక్షకులు దేవి శ్రీ
ప్రసాద్ సంగీతం గురించి సీరియస్ డిస్కషన్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఊర
మాస్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేందుకు దేవిశ్రీ ఎంతటి బ్రహ్మాండమైన సంగీతం అందిస్తున్నారనేది ఏప్రిల్ 7న సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు తెలుస్తుంది. ఆ సమయానికి పుష్పరాజ్ క్యారెక్టర్ ఇంట్రో వీడియో విడుదల అవుతుంది. ఆ వీడియోలో
దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సత్తా ఏంటో తెలిసే అవకాశం ఉంది.