పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చాలు సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడతారు. అయితే పవన్ కళ్యాణ్ నిర్మాత బండ్ల గణేష్ కు అభయం ఇచ్చినప్పటికీ ఆ మూవీ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకు వెళ్ళగలిగిన దర్శకుడు దొరకక బండ్ల గణేష్ తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈమధ్యనే కరోనా సెకండ్ ఎటాక్ నుంచి కోలుకున్న బండ్ల గణేష్ ఈ లాక్ డౌన్ సమయంలో ఒక మంచి దర్శకుడుతో పవన్ కు నచ్చే కథ వినిపించి అతడితో ఓకె అనిపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నా పవన్ కు కథ చెప్పి ఒప్పించగలిగిన దర్శకులు కరువైపోయారు అని తెలుస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే ఒక సినిమాను పవన్ తో తీసే విషయంలో బిజీగా ఉన్నాడు.


ఆతరువాత త్రివిక్రమ్ మహేష్ తో సురేంద్ర రెడ్డి అఖిల్ తో కొరటాల శివ జూనియర్ తో తీయబోతున్న సినిమాల కథల విషయంలో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ ను అడుగుదాము అనుకుంటే అతడు ఐకాన్ ప్రాజెక్ట్ ను ఏదోవిధంగా ఎవరో ఒక హీరోతో తీయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో క్రేజీ డైరెక్టర్స్ అందరు తమతమ సినిమాలతో బిజీగా ఉండటంతో బండ్ల గణేష్ కు దేవుడైన పవన్ కళ్యాణ్ వరం ఇచ్చినా ఆ వరాన్ని నెరవేర్చగలిగిన క్రేజీ డైరెక్టర్ దొరకక ఈ బ్లాక్ బష్టర్ నిర్మాత సతమతమవుతున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో ఈ నిర్మాత ఆలోచనలు పూరి జగన్నాథ్ పై మళ్ళినట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండ తో తీస్తున్న మూవీ తప్ప మరే ప్రాజెక్ట్ అతడి చేతులో లేదు. దీనితో పవన్ పూరీల కాంబినేషన్ సెట్ చేయడానికి బండ్ల గణేష్ చాల గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పూరి డ్రీమ్ కథ ‘జన గణ మన’ సినిమాగా మారుద్దామని మహేష్ జూనియర్ లతో ప్రయత్నించి భంగ పడ్డాడు. ఇప్పుడు పవన్ అంగీకరిస్తే ఆ కథకు ఇప్పటి పరిస్థుతులకు అనుగుణంగా మార్పులు చేసి పవన్ ను ఒప్పించగలడేమో వేచిచూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: