
ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా 'జగమే తంత్రం' తమిళ ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో 40వ చిత్రం అవ్వడం విశేషం. ఈ సినిమాలో అతడికి జోడిగా ఐశ్వర్య లక్ష్మీ నటించింది. ఈ సినిమా ట్రైలర్ ధనుష్ ఒక గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడు. తమిళనాడుకు చెందిన 'సురులి' అనే ఒక గ్యాంగ్ స్టర్ గా సినిమాలో చూపించారు. లండన్ లో అక్రమ ఆయుధాలు, బంగారు నగల వ్యాపారాన్ని నియంత్రించడానికి అక్కడి పొలిటికల్ లీడర్ ఒకరు గ్యాంగ్ స్టార్ అయిన సురలిని నియమించుకుంటాడు.
సురలి విదేశాలకు వెళ్లి అక్కడి గ్యాంగ్ స్టార్స్ ని ఎలా ఎదుర్కొన్నాడో అనేది ఈ సినిమాలో చూపించారు. ధనుష్ ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో జేమ్స్ కాస్మో, కలై యారసన్, జోజు జార్జ్ వంటి ప్రముఖులుఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.ట్రైలర్ చూస్తుంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అర్ధం అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ధనుష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.