సాధారణంగా ఇండస్ట్రీలో మనం హీరోల పారితోషికం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము. అయితే ఇప్పుడు టాప్ డైరెక్టర్లు పారితోషికం గురించి ఒక్కసారి చూద్దామా. బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి పారితోషికం కూడా పెరిగింది. ఇక రాజ‌మౌళి లెక్క‌లు సినిమా బ‌డ్జెట్ పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆయన 100 కోట్ల బ‌డ్జెట్ చిత్రం అయితే.. 15 కోట్లు తీసుకుంటాడ‌ని సమాచారం. ఇక ఎన్ని కోట్లు పెరిగితే ఆ మేర‌కు డ‌బుల్ అవుతుందంట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా లాభాల్లో కూడా వాటా తీసుకుంటున్న నేప‌థ్యంలో.. సినిమా ఘ‌నంగా ఆడితే.. వంద కోట్లు ముట్టినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు సినీ ప్రముఖులు.

ఇక రెండో స్థానంలో త్రివిక్ర‌మ్ నిలిచారు. గత  కొంత కాలంగా రాజ‌మౌళి త‌ర‌హాలోనే లాభాల్లో వాటా తీసుకున్నాడు మాటల మాంత్రికుడు. అంతేకాదు.. నిర్మాత‌ రాధాకృష్ణ బ్యాన‌ర్ హారిక – హాసిని సంస్థ‌లోనే సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయ‌న గ‌త చిత్రం అల‌వైకుంఠ పుర‌ములో భారీ హిట్ అందుకుంది. ఇదే తరుణంలో మ‌హేష్ బాబుతో వ‌చ్చే సినిమాకు 25 కోట్ల వ‌ర‌కు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అలాగే రొమాంటిక్ డైరెక్టర్ సుకుమార్ త‌న‌దైన శైలిలో సినిమాలను చిత్రీకరిస్తున్నారు. అయితే రంగ‌స్థ‌లం సినిమాతో సూపర్ విజయాన్ని అందుకుంది. ఆయన ఈ సినిమానికి వంద కోట్ల‌కు పైగానే వసూలు చేసింది. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఈ సినిమాకు 30 కోట్ల మేర తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ డైరెక్టర్ కొర‌టాల శివ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన నాలుగు సినిమాలూ సూప‌ర్ హిట్లుగా అందుకున్నాయి. ఇక ఈయ‌న రెమ్యున‌రేష‌న్ కూడా పెరుగుతుంది. ఇక ప్ర‌స్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఆచార్యకు రూ.13 కోట్లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: