ఈ ఫొటోలో ఉన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఈమె మనందరికీ బాగా తెలిసిన హీరోయినే. ఈమె పేరు 'దీప్తి భట్నాగర్'.ఏంటీ.. ఇంకా గుర్తుపట్టలేదా..?ఈ పేరు బహుశా ఎవరికి తెలియకపోయినా.. 'పెళ్లి సందడి' సినిమాలో స్వప్న సుందరి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆ స్వప్న సుందరే ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్.ఈమె పేరు దీప్తి భట్నాగర్.. పెళ్లి సందడి సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.


ఇక ఆ సినిమాలో 'సౌందర్య లహరి'అనే పాటలో మొహం చూపించకుండా తన నడుము అందాలతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది.ఈమె నటించిన సినిమాలు దాదాపు అగ్ర హీరోల సరసన కావడం విశేషం. నాగార్జున సరసన ఆటో డ్రైవర్, బాలకృష్ణ తో సుల్తాన్,మోహన్ బాబు తో కొండవీటి సింహం వంటి చిత్రాల్లో నటించింది.అయితే ఆ సినిమాలేవి సక్సెస్ సాధించకపోవడంతో ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.


ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ..తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది.ఇక తాజాగా దీప్తి భట్నాగర్ తన ఇన్స్టాగ్రామ్ లో పలు ఫోటోలు షేర్ చేసింది. ఎంతో గ్లామర్ గా ఉన్న ఈమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోల్లో దీప్తి భట్నాగర్ చాలా హాట్ గా.. కుర్రకారు మతులు పోగొట్టేలా కనిపిస్తోంది.దీంతో ఈ హీరోయిన్ ఫోటోలపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాలకు దూరమైన ఈమె ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకొని ముంబై లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: