సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లకు ఎప్పుడు సినిమా అవకాశాలను వస్తాయో ఎవరికీ తెలియదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయంలో ఎలాంటి అవకాశాలు రావు కానీ దాదాపు సినిమాలకు దూరంగా ఉంటున్న సమయంలో వారికి వరుస అవకాశాలు వచ్చి మళ్లీ వారి లో ఆశలు రేగేలా చేస్తాయి. ఆ విధంగా పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రీతువర్మ తెలుగులో ఇప్పుడు వరుస అవకాశాలు అందుకోవడం టాలీవుడ్ లో చర్చగా మారింది. పెళ్లి చూపులు సినిమా తర్వాత రీతూవర్మ కి తెలుగులో మరొక సినిమా అవకాశాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా హిట్ అయ్యినా ఆమె అందానికి ఎవరు కనెక్ట్ కాలేదు..

దాంతో మలయాళ సినీ పరిశ్రమపై దృష్టి సారించి అక్కడ మంచి అవకాశాలను పొందింది. స్టార్ హీరోలతో నటించి హిట్ లు కొట్టి మళ్ళీ తెలుగు దర్శకుల చూపు తనపై పడేలా చేసుకుంది. ఆ విధంగా ఆమె నాని హీరోగా తెరకెక్కిన
టక్ జగదీష్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని పొందింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే ఆమె కు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు.

ఇకపోతే తాజాగా ఆమెకు మరో పెద్ద చాన్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. శర్వానంద్ 30 వ సినిమా ఒకే ఒక జీవితం లో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్ర బృందం శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించగా,  ఆల్మోస్ట్ హీరోయిన్ గా తన పని అయిపోయింది అనుకున్న టైంలో రీతువర్మ కు ఇలా వరుస అవకాశాలు రావడం ఆమె ఫ్యాన్స్ కి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.  మరి ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఆమె ఎంతలా బిజీ అవుతుందో చూడాలి. ప్రస్తుతం తమిళ్లో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో పాటు తెలుగు లో ఇవే కాకుండా మరో రెండు మంచి ఆఫర్స్ ను అందుకుంది రీతువర్మ..

మరింత సమాచారం తెలుసుకోండి: