ప్రస్తుతం వచ్చిన వెబ్ సిరీస్ లలో క్రేజీ వెబ్ సీరీస్ గా ఉంది
అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో మనోజ్ బాజ్పాయ్
ప్రియమణి జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు దక్షిణాదిన స్టార్
హీరోయిన్ అయిన
సమంత ఈ సినిమాలో నటించడం కూడా ఈ సిరీస్ అంచనాలు పెరిగి పోవడానికి కారణం అయ్యింది.
టాలీవుడ్ దర్శక ద్వయం
రాజ్ మరియు డికేలు స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ వెబ్ సిరీస్ ప్రపంచంలోనే ప్రభంజనం సృష్టించింది.
మొదటి భాగం
పాకిస్థాన్ టేర్రరిజం బ్యాక్ అప్ లో రాగా రెండవ భాగం
చెన్నై టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. ఇక మూడో భాగం కూడా ఇప్పుడు ఉంటుందని రెండో సిరీస్ చివర్లో వచ్చిన ఒక సీన్ ను బట్టి తెలుస్తుంది. ఈ సీరీస్ విడుదల కాకముందు వివాదాల్లో చిక్కుకున్న ఆ తర్వాత నటీనటుల పై ప్రశంసల వర్షం కురిసింది. ముఖ్యంగా
సమంత నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో అలరించగా మనోజ్ బాజ్ పై కూతురుగా ధృతి పాత్రలో కనిపించిన ఆశ్లేష ఠాకూర్ కూడా హైలెట్ గా నిలిచింది.
తొలిభాగంలో చిన్నపిల్లలా కనిపించిన ఈమె రెండవభాగంలో టీనేజీ వయసులో ఉన్న
అమ్మాయి గా ఎంతో ఆకట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలను గురించి చెప్పగా ఇందులో ముద్దు సీన్ లో నటించడం ఎంతో ఆసక్తిని కలిగించింది అని ఆమె చెప్పడం విశేషం. దీనిపై చాలామంది అభ్యంతరాలు వ్యక్తపరిచగా ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించడం అంత సరదా కాదని ఈ పదిహేడేళ్ళ టీనేజర్ చెప్పింది. ఈ ముద్దు సీన్ కోసం తాను ఎంతో హార్డ్ వర్క్ చేసినట్లు చెప్పింది. నేను నా దర్శకులు ను నమ్మను. ఆ సన్నివేశం తెరపై ఎలా ఉంటుందో దాని గురించి చింతించలేదు. ఎందుకంటే కథ విషయంలో ఎంత పర్ఫెక్ట్ ఉన్నారో అన్న విషయం నాకు తెలుసు అంటూ చెప్పింది.