క్రాక్ సినిమా హిట్ కావడంతో రవితేజ లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. వరుస సినిమాల అనౌన్స్ మెంట్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్న రవితేజ ఆ తర్వాత శరత్ మండవ అనే దర్శకుడి దర్శకత్వంలో రామారావు అనే సినిమాను కూడా ఇటీవలే అనౌన్స్ చేశాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పట్టుకొని త్వరలోనే విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాకి రవితేజ పెట్టిన టైటిల్ కొంత వివాదాస్పదంగా మారుతోంది.

రామారావు అంటే బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పేరు. నందమూరి తారక రామారావు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను దక్కించుకున్నారు. ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన తండ్రిపై తీసిన బయోపిక్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించగా రామారావు అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కించాలని ఆయన ఎప్పటినుంచో ప్లాన్ చేశాడు. ఈ లోపుగానే రవితేజ తన సినిమా కు ఈ టైటిల్ ను అనౌన్స్ చేయడంతో బాలకృష్ణతో పాటు ఆయన అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. 

ఇండస్ట్రీలో ఎప్పటినుంచో బాలకృష్ణ రవితేజ లకు పడదు అని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి హీరోల ఫ్యాన్స్  తరచూ ట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఒక హీరోయిన్ విషయమై ఇద్దరికీ ఏదో వివాదం నడిచినట్టుగా చెబుతుంటారు. ఆ విధంగానే ప్రతిసారి రవితేజ లేదా బాలకృష్ణ ఒకరినొకరు గిల్లుకుంటూరని టాలీవుడ్ ఇండస్ట్రీలో భోగట్టా. వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద తన సినిమాలతో చాలా సార్లు పోటీ పడ్డారు. ఒక్కమగాడు కృష్ణ, మిత్రుడు కిక్ , పరమవీరచక్ర మిరపకాయ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడగా ప్రతిసారి రవితేజనే పైచేయి సాధించాడు. ఇప్పుడు కూడా రామారావు టైటిల్ ను పెట్టుకుని తానే పై చేయి సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: