నిజానికి చిరంజీవి తన కెరీర్ లో చేసిన మోస్ట్ ఇన్‌స్పిరేషనల్ సినిమా స్వయంకృషి. తన స్టార్ డమ్ పక్కనపెట్టి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి గా అవతారం ఎత్తి.. సహజ నటనతో అలరించి చిరంజీవి అందరినీ ఫిదా చేశారు. అందుకే ఆయనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా లభించింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది కార్మికులు ఎంతో ఆత్మ విశ్వాసంతో పనిచేయడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఒక ఫుట్‌పాత్‌పై బ్యాగులు, చెప్పులు కుట్టే ఒక వ్యక్తి తన షాప్ కి "స్వయంకృషి" అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఈ సినిమా ప్రజలపై ఎంతలా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
కె.విశ్వనాథ్ ఈ సినిమాకి కథ అందించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాటలకు సింగిరెడ్డి నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. రమేష్ నాయుడు అద్భుతంగా పాటలను స్వరపరిచారు. సిగ్గు పూబంతి ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. అయితే సినిమాలోని అన్ని పాటలు కూడా కథకు తగ్గట్లుగా ఉండి మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ సినిమా ద్వారా విదేశీయులు కూడా స్పూర్తి పొందారు. స్వయంకృషి సినిమాని రష్యాలో అనువదించి మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి