
చిన్న సినిమాలే అయినా కొన్ని కొన్ని ప్రేక్షకులను ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఆ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింప చేసి వారిలో స్ఫూర్తిని రగిలించి మంచి బాట వైపు కొనసాగేలా చేస్తాయి. ఈ విషయం కొంత లేటుగా అర్థమైనా ఆ సినిమాలు తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాలుగా టాలీవుడ్ లో మిగిలిపోతాయి. అలాంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపచేసి సినిమా నాని హీరోగా విజయ్ దేవరకొండ ప్రత్యేక పాత్రలో నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా.
బంధాలు విలువలు వంటి వాటికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం డబ్బుతో మాత్రమే మానవ ప్రపంచం ముందుకు సాగుతుందని నమ్మే హీరో తన స్నేహితుడు ప్రవర్తన వల్ల ఎంతో విసిగి పోతాడు. తన స్నేహితుడి కోరిక దూద్ కాశీ కి వెళ్లడం అయితే మధ్యలోనే ఆ స్నేహితుడు మరణిస్తాడు. ఎంతో బలవంతంగా తన స్నేహితుడి కోరిక తీర్చడానికి తన అస్థికలు కాశీలో కలపడానికి హీరో అక్కడ్నుంచి బయలుదేరగా ఈ ప్రయాణం లో ఎదురైన పరిస్థితులు, తలెత్తిన స్థితిగతులు హీరోలో మార్పు ను తీసుకు వస్థాయి.
నాని హీరోగా నటించిన ఈ సినిమాలో హీరో స్నేహితుడు పాత్రలో విజయ్ దేవరకొండ నటించి ఒక్క సారి గా అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత నే విజయ్ దేవరకొండ కు పెళ్లి చూపులు సినిమా అవకాశం వచ్చి ఆ తర్వాత స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. సినిమాలో కథ ఉంటే ఇప్పటికైనా ఆ సినిమా హిట్ అవుతుందని నిరూపించింది ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమాతో నేషనల్ అవార్డు సంపాదించిన నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అవగా ఎందరో ప్రేక్షకుల మనసులను కదిలించిన సినిమాగా టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది ఎవడే సుబ్రహ్మణ్యం.