కుర్రహీరోలకు బ్యాడ్ టైమ్ ఎదురవుతోంది. ఈ వయసులో వరుస హిట్ లు కొట్టి రాకెట్ స్పీడ్ లో దూసుకుపోవాల్సిన వాళ్లను ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. దీంతో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు ఆ హీరోలు. ఎలాగైనా హిట్ కొట్టి.. సక్సెస్ హీరో అనే పేరు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారు.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్‌ పరిస్థితి అయోమయంగా తయారయింది. కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో సందడి చేయలేకపోతున్నాడు. ఆరేళ్లుగా సరైన సక్సెస్‌ లేక ఢీలా పడిపోయాడు. 'శౌర్య, ఎటాక్, గుంటూరోడు' ఫ్లాపులతో మనోజ్ మార్కెట్‌ మొత్తం డౌన్ అయిపోయింది.


సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత వారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు శిరీష్‌ సినీ ప్రయాణం ఫ్లాపులతోనే నడుస్తోంది.  'శ్రీరస్తు శుభమస్తు' తర్వాత శిరీష్‌కి సరైన సక్సెస్ లేదు. 'ఒక్క క్షణం, ఏబిసిడి' లాంటి ఫ్లాపులతో శిరీష్‌ ఢల్ అయిపోయాడు.

ఇక కార్తికేయ విషయానికొస్తే.. 'ఆర్.ఎక్స్.100'తో మంచి పేరు సంపాదించుకున్నాడు.  ఈ హిట్‌తో కర్ర ప్రేక్షకులక బాగా దగ్గరైపోయాడు. అయితే ఈ మూవీ తర్వాత కార్తికేయకి మళ్లీ ఆ రేంజ్‌లో విజయం రాలేదు. 'హిప్పీ, గుణ 369, 90 ఎమ్.ఎల్., చావుకబురు చల్లగా' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దీంతో కార్తికేయ సినీ కెరీర్ డేంజర్ జోన్ లో పడింది.

అక్కినేని వారసుడు అఖిల్‌పై ప్రేక్షకులు చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు సక్సెస్ రుచి చూడలేదు ఈ హీరో.   'మనం'లో ప్రత్యేకంగా కనిపించిన తర్వాత అఖిల్‌ విషయంలో ఏమేమో ఊహించుకున్నారు. అయితే ఈ కుర్ర హీరో మాత్రం అక్కినేని అభిమానుల మనసు గెలుచుకోలేకపోయాడు. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేందుకు 'మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్'గా మారాడు అఖిల్. అలాగే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలైనా అఖిల్ ను సక్సెస్ లో నడిపిస్తాయేమో చూడాలి.  

రౌడీ హీరో విజయ్ దేవరకొండకి యూత్ లో మంచి పేరు తీసుకొచ్చిన సినిమా 'అర్జున్‌రెడ్డి. ఈ హిట్ తో కోలీవుడ్, మాలీవుడ్ లలో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు.  ఈ రేంజ్‌కి వెళ్లిన విజయ్‌ని 'డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాపుల్లో ముంచాయి. దీంతో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో 'లైగర్' సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. చూద్దాం.. ఈ హీరోలను ఎప్పుడు సక్సెస్ వరిస్తుందో..



 


మరింత సమాచారం తెలుసుకోండి: