సాధారణంగా కథ ,  కథాంశం ప్రకారం  నచ్చితే ప్రేక్షకులు ఏ భాష సినిమానైనా ఆదరిస్తారు. ఇకపోతే సాధారణంగా తెలుగు ప్రేక్షకులతో పోల్చుకుంటే,  మిగతా ప్రేక్షకులు కేవలం వారి భాషకు సంబంధించిన సినిమాలనే ప్రోత్సహించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే , తెలుగు సినిమా అది కూడా పరాయి భాషలో ఏకంగా 500 రోజులు అడిందంటే, అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరం కంటే పైగా థియేటర్లలో ఆడి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమా విశేషాలు ఏమిటో..? ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం..

బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా మరో చరిత్ర. ఇందులో హీరోగా కమల్ హాసన్, హీరోయిన్ సరిత నటించారు. ఈ సినిమా కథను మొదలు పెట్టడానికి ముందే , కమలహాసన్ దాసరి దర్శకత్వంలో  కన్యాకుమారి సినిమా షూటింగ్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నాడు.  ఇక ముందు బాలచందర్ , తన శిష్యుడైన దాసరికి ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పాడు. అయితే అప్పటికే కన్యాకుమారి అనే సినిమాను తీస్తున్నాడు దాసరి కాబట్టి, గురువుగారు చెప్పారన్న  కారణంతోనే కన్యాకుమారి సినిమా షూటింగ్ ని పక్కనపెట్టి కమలహాసన్ కు మరోచరిత్ర సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చాడు.

ఇక మొదట హీరోయిన్  గా దీప ను అనుకోగా, ఆమెకు డేట్స్ కుదరక పోవడంతో ఎన్నో ఆడిషన్స్ జరిపిన తర్వాత, చివరకు సరితను  హీరోయిన్ గా  సెలక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే సరిత చూడడానికి పొట్టిగా, నల్లగా ఉంది. కానీ ఆమెలో చురుకుదనం బాగా ఉండడంతో బాలచందర్ ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తున్న సమయంలో.. మరో ప్రేమ కథ, అంతులేని ప్రేమ కథ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు . కాకపోతే ఈ చిత్ర నిర్మాత చరిత్రలో నిలిచిపోయే ఒక టైటిల్ పెట్టాలని సలహా ఇవ్వడంతో, ఈ చిత్రానికి మరో చరిత్ర అనే టైటిల్ పెట్టారు. ఇక భీమునిపట్నం , అరకు , విశాఖపట్నం వంటి లొకేషన్స్ లో సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.

ఇక పూర్తి షూటింగ్ ముగించుకొని, 1978 వ సంవత్సరం మే 19వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమాను డబ్బింగ్ చేయకుండానే తెలుగులో చెన్నైలో విడుదల చేస్తే, అక్కడ ఏకంగా 500 రోజులు కంటే ఎక్కువ రోజులు ప్రదర్శించబడి , మరో చరిత్ర సినిమా మరో రికార్డును సృష్టించింది. అంతే కాదు హిందీలో కూడా ఈ సినిమా రీమేక్ చేయబడిన, అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకోవడం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: