ఎప్పుడూ బిగ్ స్క్రీన్‌పైనే అద్భుతాలు చేస్తున్న టాలీవుడ్ స్టార్స్ అంద‌రూ కూడా ఇప్పుడు బుల్లితెర‌పై కూడా హ‌వా కొన‌సాగిస్తున్నారు. ఈ విష‌యంలో ఇప్ప‌టికే నాగార్జున‌, చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు స‌త్తా చాటారు. ఇక వీరితో పాటు స‌మంత‌, క‌మెడియ‌న్లు ఆలీతోపాటు బ్ర‌హ్మానందం అలాగే సాయి కుమార్ ఇప్పుడు లేటెస్టుగా త‌మ‌న్నా కూడా ఈ జాబితాలో చేరిపోయి చాలానే ప్రోగ్రామ్స్ చేస్తోంది. అయితే ఇక్క‌డ ఓ సీనియ‌ర్ హీరో గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయ‌న‌కు వీళ్లందరి కంటే ముందు వెంకటేష్ కి బుల్లితెర హోస్టింగ్ చేయాలంటూ రిక్వెస్ట్ లు వ‌చ్చినా ఆయ‌న మాత్రం స్పందించ‌ట్లేదు.

చాలామంది అయితే సినిమాని మంచి కూడా మంచి పారితోషికం ఇస్తామంటూ చాలా ఛానెల్ మేనేజ్ మెంట్లు ఆఫ‌ర్లు ఇస్తామ‌న్నా కూడా వెంకీ స్పందించ‌లేదంట‌. ఇంకా చెప్పాలంటే మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ -2కి విక్ట‌రీ వెంక‌టేష్ ను హోస్ట్ గా చేయాలంటూ చాలామంది కోరారంట‌. అయితే ఇలాంటి మంచి ఆఫ‌ర్ ను కూడా వెంకీ సున్నితంగా తిరస్కరించారు. ఇంక దీని త‌ర్వాత కూడా బిగ్ బాస్ లో ఒక్క సీజన్ కి అమిరా వెంకీని హోస్ట్ గా చేయించాల‌ని నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నా అది మాత్రం వ‌ర్కౌట్ కావ‌ట్లేదంట‌.

ఇక రీసెంట్ గా అయితే మాస్ట‌ర్ చెఫ్ కూడా ముందు వెంకీని చేయించాల‌ని అనుకున్నా దాన్ని కూడా వెంకీ వ‌ద్ద‌ని చెప్పాడంట‌. ఇంత‌గా వెంకీకి బుల్లితెర ఆఫ‌ర్స్ ఎంత వ‌ద్ద‌నుకున్నా వ‌స్తున్నా కూడా ఆయ‌న మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదంట‌. ఎంత పెద్ద లీడ‌ర్లు వ‌స్తున్నా కూడా ఆయ‌న మాత్రం వాటిని తృణప్రాయంగా వద్ద‌ని చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు కూడా టీవీ షోల‌లో సంద‌డి చేస్తుండ‌గా.. వెంక‌టేష్ మాత్రం చేయ‌న‌ని చెప్తున్నారు. అయితే ఆయ‌న ఇన్ని ఆఫ‌ర్లు వ‌దులుకోవ‌డానికి అస‌లు కార‌ణం ఏంట‌న్న‌ది ఇప్పుడు మిస్ట‌రీగా మారిపోయింది. ఎందుకంటే వెంకీ ఇటీవ‌ల ఎక్కువ‌గా ఆధ్యాత్మిక చింతనతో సినిమాల విషయంలో కూడా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక టైమ్ లేద‌నే కార‌ణం బ‌లంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: