పవన్ ఇప్పుడు పూర్తిగా రాజకీయ నాయకుడు అయిపోయాడు. సినిమాలపై దృష్టి తగినట్లుగా తెలుస్తుంది. మొన్నటి వరకు వరుస సినిమాలు ఒప్పుకొని అవి పూర్తి చేసే దిశగా పనులు చేసాడు. కానీ ఇటీవల కాలంలో అయన రాజకీయాలపైనే ఎక్కువ సమయ వెచ్చిస్తున్నాడు. ఇటీవలే ఆయన రిపబ్లిక్ డే ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆయనను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మార్చివేశాయి. సినిమా ఫంక్షన్లో సాక్షాత్తు సీఎం ను అన్ని మాటలు అనడం అంటే సామాన్యమైన విషయం కాదు. సినిమాల గురించి ఆవేదన చెందుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలలో న్యాయం ఉందని కొంతమంది చెబుతున్నారు.
ఇక ఆ స్పీచ్ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ పై చాలా ఉంటుంది ముఖ్యంగా ఆయన సినిమాలపై ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎవరు నష్టపోతారో తెలియదు కానీ నిర్మాతకు మాత్రం ఇప్పటి నుంచే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భిమ్లా నాయక్ సినిమాను ఆయన హీరో గా తెరకెక్కించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయితగా చేయగా రానా మరో ముఖ్యమైన పాత్రలో నటించాడు. నిత్య మీనన్ మరియు ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సమయంలో మరో రెండు పెద్ద సినిమాలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం బెదరకుండా అదే సమయానికి సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఇప్పుడు రాజమౌళి సినిమా రావడం ఒక్కసారిగా పవన్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ని తెచ్చిపెట్టింది.. ఓ వైపు తన స్పీచ్ ద్వారా వైసీపీ నాయకుల కళ్ళల్లో పడ్డ పవన్ కళ్యాణ్ మరోవైపు ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీని ప్రకటించడం అది తన సినిమాకు దగ్గరగా ఉండడం పవన్ కళ్యాణ్ భయాన్ని పుట్టిస్తుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. పవన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆడకుండా చేద్దామని ఏపీలో ప్రభుత్వ నాయకులు చూస్తూ ఉండగా ఇప్పుడు రాజమౌళి ఇలా చేయడం పవన్ కళ్యాణ్ కు కొంత ఇబ్బంది కలుగుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి