హీరోగా తన కెరీర్ అయిపోయింది అనుకున్న సమయంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి జగపతి బాబు ఒకసారిగా తన సినీ కెరీర్ భవిష్యత్తును మార్చుకున్నాడు. హీరోగా ఆయనకు మంచి పేరు ఉండగా విలన్ గా మారిన తర్వాత ఆయన కు అంతకు మించిన క్రేజ్ రావడంతో ఆయన అభిమానులు ఎంతగానో ఖుషీ అయ్యారు. ఆయన హీరోగా చేయడం లేదు అన్న పేరే కానీ ఇప్పుడు ఆయనకు భారీ స్థాయి లో హీరో లకు మించిన క్రేజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ విధంగా జగపతిబాబును విలన్ గా మార్చిన ఘనత బోయపాటి శ్రీనుకు ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు అదే ప్రయత్నాన్ని శ్రీకాంత్ విషయంలో చేయబోతున్నాడు. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రాబోతున్న అఖండ సినిమాలో శ్రీకాంత్ నటిస్తుండగా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన వచ్చిన టీజర్ లో శ్రీకాంత్ లుక్ చూసి ఒక్కసారిగా అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. విలన్స్ ను క్రూరంగా చూపించడంలో బోయపాటి శ్రీను కు పెట్టింది పేరు. అలాంటి దర్శకుడి చేతిలో శ్రీకాంత్ విలన్ గా రీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు ఆయనను దూసుకుపోయే విధంగా చేస్తుందని చెప్పవచ్చు.

ఇకపోతే ఇప్పుడు మరొక హీరో కూడా విలన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎవరో కాదు కార్తికేయ. ఆయన హీరోగా ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత ఆయన చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేక పోయాయి. తాజాగా ఆయన నటించిన రాజా విక్రమార్క చిత్రం కూడా నిరాశపరిచగా ఇప్పుడు ఆయన విలన్ గా తన కెరియర్ ను సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో ఆయన విలన్ గా నటించగా ఇప్పుడు అజిత్ హీరోగా చేస్తున్న ఓ తమిళ సినిమాలో కూడా ఆయన విలన్ గా చేస్తున్నాడు. అలాగే బోయపాటి శ్రీను తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో చేస్తున్న చిత్రం లో కూడా కార్తికేయ విలన్ గా నటించబోతున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: