జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలియా భట్ మరియు ఒలివియా మోరీస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా భారతదేశం గర్వించగ్గ ఎందరో నటులు ఈ చిత్రంలో నటిస్తున్నడం విశేషం.

ఇక ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఓ వైపు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటు ఉండగా మరోవైపు రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేశాడు. కాగా ఈరోజు ఈ సినిమాలో రాబోయే మరొక పాట జననీ సాంగ్ గురించి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆ పాట యొక్క విశిష్టతను తెలిపాడు జక్కన్న. 

ఇక ప్రతి పాటలో మంచి ఎమోషన్ ఉంటుందని ముఖ్యంగా తన సినిమాల్లో తప్పకుండా పాటలలో మంచి ఎమోషన్ ఉంటుందని అంతకంటే ఎక్కువగా ఈ సాంగ్ లో ఎమోషన్ ఉంటుందని తెలిపాడు.  సినిమా యొక్క ఎమోషన్ మొత్తం ఈ పాటలో కలిగి ఉంటుందని ఆయన వెల్లడించారు.  ఈ విధంగా ఈ పాట అందరికీ నచ్చే విధంగా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. మరి రేపు ఈ పాటను విడుదల చేస్తుండగా ఇంత స్పెషాలిటీ ఉన్న ఈ పాటను విని తరించాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఎంతో ఆతృతగా ఈ పాట కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో రేపు విడుదల కాబోతున్న ఈ పాటకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ పాట కూడా అదిరిపోయేలా ఉంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: