ఈ సంవత్సరం టికెట్ల విషయంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగినప్పటికీ అఖండ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఒక ఊపు వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం టికెట్ రేటు తక్కువగా ఉన్నప్పటికీ పెద్ద సినిమాలు 2, 3 అయినా కచ్చితంగా ప్రేక్షకులు చూస్తారు అన్నట్టుగా అఖండ సినిమా నిరూపించింది. దీంతో భయపడకుండా నిర్మాతలు, దర్శకులు కూడా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద సినిమాలను వరుసగా రిలీజ్ చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఈ నేపద్యంలోని డిసెంబర్ 17 వ తేదీన పుష్ప సినిమా రిలీజ్ కాబోతుండగా.. అటు శ్యామ్ సింగరాయ కూడా విడుదల అవుతోంది. ఇక ఆ తర్వాత సంక్రాంతి సినిమాల హవా మొదలవుతుంది కాబట్టి ఇప్పుడే చిన్నాచితకా సినిమాలన్నీ కూడా డిసెంబర్ 10వ తేదీన విడుదల కావాలని నిర్ణయం తీసుకున్నాయి. అలా ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాల గురించి తెలుసుకుందాం.

1. లక్ష్య:విలువిద్య స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగసౌర్య హీరోగా.. తన లో ఉన్న ప్రతిభ ను చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలవగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.


2. గమనం:శ్రియా శరణ్ కీలక పాత్ర పోషిస్తూ.. ప్రముఖ దర్శకురాలు సృజన రావు మొదటిసారి ఈ సినిమాతో తెలుగు తెరకు డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను సినిమాగా రూపొందించబోతున్నారు.

3. బుల్లెట్ సత్యం:
4. నయీమ్ డైరీస్:
5. మడ్డీ:

6. మన ఊరి పాండవులు:

7. ప్రియతమా:

8. కటారి కృష్ణ:


మొత్తం ఎనిమిది సినిమాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. ఈ లిస్టులో కొంచెం క్రేజ్ ఉన్న సినిమాల విషయానికొస్తే గమనం, లక్ష్య  సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఏమైనా ఈ సినిమాలు ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధ మవుతున్నాయి..ఇక అన్నీ కూడా థియేటర్లలో విడుదల కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: