జూనియర్ ఎన్టీఆర్ లుక్ విషయంలో అశ్రద్ధ చేస్తూ బండగా తయారైనప్పుడు రాజమౌళి పట్టుపట్టి అతడి లుక్ ను మార్చడమే కాకుండా అతడి కెరియర్ కు బ్రేక్ ఇచ్చే విధంగా ‘యమదొంగ’ మూవీని నిర్మించి జూనియర్ కెరియర్ ఎదుగుదలకు సహకరించాడు. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో రిపీట్ అవుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో జూనియర్ బాలీవుడ్ ఎంట్రీ జరగబోతోంది. ఈమధ్య ముంబాయిలో జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో బాలీవుడ్ మీడియా నుండి చరణ్ కు ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురైంది.
రాజమౌళితో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చేస్తూ మూడు సంవత్సరాలు ఈసినిమా కోసమే ఉండిపోయారు కాబట్టి ఎన్ని సినిమాలు పోగొట్టుకున్నారు అంటూ ఒక బాలీవుడ్ విలేఖరి జూనియర్ కార్నర్ చేయటానికి ప్రయత్నించాడు. అయితే మాట్లాడే విషయంలో చాల సమయస్పూర్తి ప్రదర్శించే జూనియర్ చాల తెలివిగా సమాధానం ఇచ్చాడు.
ఒక హీరో రాజమౌళితో సినిమా చేస్తున్నాడు అని తెలియగానే దేశంలో ఏ నిర్మాత కానీ మరే దర్శకుడు కానీ రాజమౌళి హీరోతో సినిమా తీసే సాహసం చేస్తారా అంటూ జోక్ చేసాడు. రాజమౌళి పంజరంలోకి వెళ్ళడం వరకే హీరోకి ఛాయస్ ఉంటుందని ఆపంజరం నుండి ఎప్పుడు బయట పడతాము అన్నది ఆ హీరోకి కూడ తెలియని విషయం అంటూ జూనియర్ అనగానే ఆమీడియా మీట్ కు వచ్చిన వారంతా తెగ నవ్వుకున్నారు. ‘బాహుబలి’ తో ప్రభాస్ ఓవర్ నైట్ లో సెలెబ్రెటీగా మారిపోయాడు. ఇప్పుడు ఇదే అదృష్టం తనకు కూడ వస్తుందని జూనియర్ తెగ ఆశ పడుతున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి