నందమూరి ఫ్యామిలీ హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 'బింబిసార' అనే పిరియాడిక్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బార్బేరియన్ కింగ్ గా కనిపించబోతున్నాడు. నూతన దర్శకుడు వశిష్ట్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించడం గమనార్హం. కళ్యాణ్ రామ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాదు మరోవైపు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోంది.

ఇదిలా ఉంటే బింబిసార సెకండ్ పార్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడనే ప్రచారం ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతోంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. గతంలోనే ఈ కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి కాంబినేషన్లో సినిమా వర్కవుట్ అవ్వలేదు. అయితే ఎన్టీఆర్ మాత్రం బింబిసార సినిమాలో నటిస్తున్నారనే దానిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం కథను మలుపు తిప్పే పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్ పాత్ర ఎవరు ఊహించని ట్విస్ట్ తో ఉండేలా దర్శకుడు ఈ సినిమాను ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంత మంది మాత్రం ఈ న్యూస్ నిజం కాకపోవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ కనుక కళ్యాణ్ రామ్ సినిమా లో కనిపిస్తే నందమూరి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడిగా సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 5వ శతాబ్దానికి చెందిన రాజు బింబిసారుడి కథ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఈ సినిమాకోసం కళ్యాణ్ రామ్ తన మేకోవర్ మొత్తాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు ఈ నందమూరి హీరో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: