ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం రాజమౌళి పూర్తిగా మారిపోవాలని అనుకుంటున్నాడట. మహేష్ తో తీయబోయే సినిమాను కేవలం ఒక సంవత్సరంలో పూర్తిచేసి విడుదల చేయాలని జక్కన్న ప్లాన్ అంటున్నారు. అంతేకాదు ప్రభాస్ జూనియర్ చరణ్ లను కష్టపెట్టినంతగా మహేష్ ను కష్ట పెట్టకూడదని మహేష్ ను చాల అందంగా చూపిస్తూనే తన భారీ సినిమాను ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తి చేసుకోవాలని రాజమౌళి యాక్షన్ ప్లాని అని తెలుస్తోంది.
వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ముందు మహేష్ తో తీయబోయే సినిమాను 8వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీయాలని రాజమౌళి అనుకున్నట్లు టాక్. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ ఇచ్చిన అనుభవాలతో సినిమాలో భారీతనం కంటే కథ కూడ ముఖ్యం కాబట్టి ముందు మహేష్ సినిమా కథ విషయమై చాల ఆలోచనలు చేయాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు.
రాజమౌళి సినిమాలలో హీరోను మించిన స్థాయిలో విలన్ పాత్ర ఉంటుంది. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో విలన్ క్యారెక్టర్ పెద్దగా రాణించక పోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఊహించిన స్థాయిలో సక్సస్ కాలేదు అన్నకామెంట్స్ కూడ ఉన్నాయి. ఈ అనుభవం రీత్యా మహేష్ మూవీలో విలన్ పాత్రను చాల పవర్ ఫుల్ గా క్రియేట్ చేయాలని రాజమౌళి ఆలోచన. ఈమూవీని 2023 జనవరి 1న మొదలుపెట్టి 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని రాజమౌళి ప్రయత్నం అయితే ఇదే సాధ్యమేనా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి