సోషల్ మీడియాలో నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.కళ్యాణ్ రామ్ ఇలా సిక్స్ ప్యాక్ రావడం అంటే అసలు మామూలు విషయం కాదు.హీరోగా సక్సెస్ లేక హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. అయినా కానీ కెరీర్ పరంగా సక్సెస్ ల కోసం చకోరా పక్షి తరహా లో ఎదురు చూస్తూ కెరీర్ లో ముందుకు వెళ్లేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం బింబిసారా అనే సినిమాను కళ్యాణ్ రామ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఆ సినిమా కోసం ఆయన ఇలా ఫిజికల్ గా చాలా మారినట్లుగా సమాచారం తెలుస్తోంది.ఇక కళ్యాణ్ రామ్సినిమా లో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక అందుకు సంబంధించిన లుక్స్ కూడా ఇప్పటికే అధికారికంగా బయటకు రావడం జరిగింది. సోషియో ఫాంటసీ సినిమా గా ఈ సినిమా ఉంటుందా లేదంటే మరో రకంగా ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ అనేది ఇవ్వలేదు.



కాని సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ కు చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని మాత్రం చాలా మంది కూడా ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలలో ఆయనకు నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టినవి ఉన్నాయి. కాని కమర్షియల్ గా హిట్ లు దక్కించి పెట్టలేదు. కాని ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఆయనకు మంచి కమర్షియల్ హిట్ ని తెచ్చి పెడుతుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్దకు ఈ సినిమా ఆగస్టులో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కళ్యాణ్ కెరీర్ లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన అతనొక్కడే, ఇంకా ఎలాగే అనిల్ రావీపూడి డైరెక్షన్ లో వచ్చిన పటాస్ సినిమాలు తప్ప హిట్ సినిమాలే లేవు. కొన్ని సినిమాల్లో యాక్టింగ్ బాగున్నా కానీ అవి సరిగ్గా ఆడలేదు. ఇక బింబిసారా సినిమాతోనైనా కళ్యాణ్ రామ్ మంచి కం బ్యాక్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: