సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన వారిలో రాజమౌళి ఒకరు.. నిజంగా రాజమౌళి డైరెక్షన్లో సినిమా అంటే ఏ హీరో అయినా సరే పూర్తిస్థాయిలో కష్టపడాల్సి ఉంటుంది . అనుకున్న సీన్  అనుకున్న విధంగా వచ్చే వరకు ఆయన నటీనటులను పీల్చి పిప్పి చేస్తారు అనడంలో సందేహం లేదు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనకు ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా వారు తెలియజేశారు . జక్కన్న చేతిలో పడితే మనిషి హూనం అయిపోవాల్సిందే అంటూ వారు కామెంట్లు కూడా చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి కొమరం భీముడో అనే పాట విడుదలవ్వగా యూట్యూబ్లో  రికార్డు స్థాయిలో వ్యూస్ నమోదు చేసుకుంటోంది.

ఇకపోతే ఈ సాంగ్ లో ఎన్టీఆర్ నటనకు ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లకు అభిమానులు  మొత్తం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇదిలా వుండగా ఈ పాట వెనుక ఒక ఆసక్తికరమయిన విషయం దాగి ఉంది.. అంతేకాదు ఈ పాట కోసం జక్కన్న చేతిలో ఎన్టీఆర్ నరకం చూశారు అని సమాచారం. సుమారుగా  47 డిగ్రీల ఎండలో ఈ పాట షూటింగ్ జరిగిందని కాళ్లకు చెప్పులు లేకుండా ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు అని సమాచారం. కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో పది నిమిషాలు నిలబడాలంటే కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది 15 రోజుల పాటు ఈ షూటింగ్ లో 47 డిగ్రీల ఎండలో  కాళ్లకు చెప్పులు లేకుండా షూట్ చేశారు అంటే ఆయన ఎంత నరకం అనుభవించి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు.

నిజంగా చెప్పాలంటే పూర్తిస్థాయిలో విపరీతమైన నరకం అనుభవించారట ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభించింది. ఆయన కోరుకున్నట్లుగానే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు లభించింది. ఏది ఏమైనా జక్కన్న వల్ల ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో కష్టాలు పడినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: