టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి నటుడి గా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సత్య దేవ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సత్య దేవ్ కెరియర్ ప్రారంభంలో  చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకొని హీరోగా అవకాశాలు దక్కించుకొని మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరో గా కొనసాగుతున్నాడు .

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం క్రేజీ హీరోగా కొనసాగుతున్న సత్య దేవ్ తాజాగా గాడ్సే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే . ఈ సినిమాలో సత్యదేవ్ సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించగా ,  ఈ మూవీ కి గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించాడు. ఇది వరకు సత్య దేవ్, గోపి గణేష్ పట్టాభి కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాఫ్ మాస్టర్ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు . మంచి అంచనాల నడుమ జూన్ 17 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. మరి 5 రోజులకు గాను గాడ్సే మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసు కుందాం .

నైజాం : 26 లక్షలు , సీడెడ్ : 12 లక్షలు , ఆంధ్ర ప్రదేశ్ 19 లక్షలు .
5 రోజులకు గాను గాడ్సే మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.57 కోట్ల షేర్ , 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది .
కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో : 0.06 కోట్లు .
5 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఘాట్ మూవీ 0.63 కోట్ల షేర్ ,1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: